Begin typing your search above and press return to search.
లఖింపూర్ ఖేర్ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
By: Tupaki Desk | 4 April 2022 11:47 AM GMTలఖింపూర్ ఖేరీ హింసాత్మక కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా బెయిల్ ను రద్దు చేయాలా? వద్దా? అనే అంశంపై సుప్రీంకోర్టు సోమవారం తన తీర్పును రిజర్వ్ చేసింది. లఖింపూర్ ఖేరీ హింసపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది.. ఈ సందర్భంగా యూపీ తరుఫున ప్రభుత్వ న్యాయవాది మాట్లాడారు. శుక్రవారం మాకు నివేదిక అందిందని.. దానిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపామని తెలిపారు.
దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ఈ అంశంపై ఎక్కువ కాలం వేచి ఉండబోమని తెలిపారు. దీనిపై కోర్టు మేం చేయాలో మాకు తెలుసునని పేర్కొన్నారు. మరోవైపు బెయిల్ మంజూరులో హైకోర్టు వాస్తవాలను పట్టించుకోలేదని పిటీషనర్ జగ్జిత్ తరుఫున దుష్యంత్ దవే అన్నారు. ఇది తీవ్రమైన హత్య కేసుగా పేర్కొన్నారు. థార్ జీపుతో ప్రజలను హతమార్చారని ఎఫ్ఐఆర్ లో స్పష్టంగా రాసి ఉందని దవే అన్నారు.
ఈ వాహనంలోనే కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా కూర్చున్నారని.. ఈ సందర్భంగా బుల్లెట్లు కూడా పేల్చారని ఆయన వాదించారు.బెయిల్ మంజూరులో హైకోర్టు ప్రజలను ఉద్దేశపూర్వకంగా వాహనంతో దాడి చేసిన విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదని దవే అన్నారు. ఆశిష్ మిశ్రా ప్రజలను కొట్టారని స్పష్టంగా చెప్పారని పిటీషనర్ తరుఫున న్యాయవాది దుష్యంత్ దవే అన్నారు.
అయితే బెయిల్ మంజూరు చేస్తూ కాల్పులు జరిపినట్లు ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు తెలిపింది. మంత్రి అజయ్ మిశ్రా బెదిరించారని.. డిప్యూటీ సీఎం రూటు మార్చినప్పటికీ నిందితులు మాత్రం రైతులు ఉన్న బాటలోనే పయనించారని వాదించారు. దీనిపై సిట్ సమగ్ర విచారణ జరిపిందని దవే తెలిపారు. వీడియో, ఆడియో సాక్ష్యాలు అందించారు. ఈ క్రమంలోనే అన్ని వాదనలు విన్న సుప్రీంకోర్టు నిందితులు ఆశిష్ మిశ్రా బెయిల్ ను కొనసాగించాలా? లేక అతడి బెయిల్ రద్దు చేయాలా? అన్న దానిపై తీర్పు రిజర్వ్ చేసింది.
యూపీలోని 'లఖింపూర్ ఖేరి'లో జరిగిన దారుణం దేశవ్యాప్తంగా సంచలనమైంది. నిరసన చేస్తున్న రైతులు తమ దారిలో తాము ముందుకు సాగుతుంటే ఏమాత్రం కనికరం లేకుండా వాహనంతో గుద్దేసి ముందుకు వెళ్లిన నేతల వైనం షాకింగ్ గా మారింది.
చుట్టూ వందల మంది ఉన్నా వాహనంతో ఢీకొడుతూ మనుషుల ప్రాణాలు తీసిన వైనం విస్తుగొలుపింది. అధికారబలంతో ఓ నేత చేసిన పని ఇదీ అని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో తన కుమారుడు ఓ కేంద్ర సహాయ మంత్రి కప్పిపుచ్చే పని చేయడం విమర్శలకు తావిస్తోంది.తాజాగా అతడికి బెయిల్ పై సుప్రీం తీర్పు రిజర్వ్ చేసింది.