Begin typing your search above and press return to search.

తాలిబన్ల రాజ్యంలో మళ్లీ ఆరాచకకాండ మొదలు

By:  Tupaki Desk   |   17 Nov 2022 4:09 AM GMT
తాలిబన్ల రాజ్యంలో మళ్లీ ఆరాచకకాండ మొదలు
X
అగ్రరాజ్యం అమెరికా రక్షణ నుంచి బయటకు వచ్చేసి.. తాలిబన్ల చేతికి అధికార పగ్గాలు వచ్చిన నాటి నుంచి ఆఫ్ఘనిస్థాన్‌లో ఆరాచకం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. మొదట్లో మితవాదులుగా కలరింగ్ ఇచ్చేందుకు కొంత హడావుడి చేసినా.. అదంతా ఉత్తుత్తి షో మాత్రమేనన్న విషయం ఇప్పటికే అర్థం కాగా.. ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారిందని చెబుతున్నారు.

దేశంలో మానవ హక్కులు అన్నవే లేకుండా పోయాయని.. మహిళల విషయంలో మరింత దారుణ పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెబుతున్నారు. తమ పిచ్చి ఆదేశాల్ని ఎవరూ ఫాలో కాకున్నా తీవ్రమైన శిక్షలు విదించేందుకు వెనుకాడటం లేదు.

ఇదిలా ఉంటే దేశంలో పెరిగిన దొంగతనాలు.. కిడ్నాప్ లను కంట్రోల్ చేయటానికి వీలుగా కఠిన శిక్షలు అమలు చేయటంతోపాటు.. బహిరంగంగా.. రోడ్ల మీదనే ఉరి తీయటాలు.. కొరడా దెబ్బలు వేయటాన్ని మొదలు పెట్టారు.

దేశ న్యాయమూర్తులు షరియా చట్టాన్ని అమలు చేయాలన్న ఆదేశాల్ని జారీ చేస్తున్నారు. తాలిబన్లు తొలిసారిగా 1996 నుంచి 2001 వరకు ఆప్ఘానిస్తాన్ ను పాలించారు. అప్పట్లో ఆరాచక పాలనను చేపట్టారు. అగ్రరాజ్యం అమెరికా దెబ్బకు తాలిబన్లు తోక ముడిచారు. మళ్లీ బలపడిన వారు ఆఫ్టాన్ మీద పట్టు సాధించారు.

అయితే.. ఆఫ్టాన్ జోలికి ఇప్పుడు వద్దని రావటంతో పాటు తమ అంతర్గత విధానాలపై చర్చకు పిలిచిన వారు గతంలో మాదిరి బహిరంగ శిక్షలకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే ఆడపిల్లలు తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతూ.. నిత్యం చచ్చి బతుకుతున్న వారి పరిస్థితి గురించి తెలుసుకున్న వారు మాత్రం.. ఆఫ్టానిస్థాన్ లో తమ బతుకులుఏ రాత్రి వేళలో ఆచూకీ లేకుండా చేస్తారన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీరి ఆరాచకం నుంచి కాపాడే వారెవరు? అన్నది ప్రశ్నగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.