Begin typing your search above and press return to search.
పంజ్ షీర్ ప్రాంతం అంటేనే తాలిబన్లకు తడిసిపోతుంది..!
By: Tupaki Desk | 20 Aug 2021 6:35 AM GMTఅప్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో ఆ దేశ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇతర దేశాలు కూడా తాలిబన్ల అరాచకాలు గుర్తుకు తెచ్చుకొని అప్ఘాన్ నుంచి తమ దౌత్య కార్యాలయ సిబ్బందిని వెనక్కి తీసుకొచ్చారు. కేవలం నెల రోజుల్లోనే అప్ఘాన్ ను ఆక్రమించిన తాలిబన్లు ఓ వైపు శాంతి మంత్రం పటిస్తూనే మరోవైపు కాల్పులు కొనసాగిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. తాలిబన్ల అంటే అప్ఘాన్ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు సైతం భయంతో వణికిపోతున్నాయి. అలాంటి తాలిబన్లను వణికించడానికి కొందరు అక్కడే ఉన్నారు. వారంటే తాలిబన్లకు చచ్చేంత భయం. అంతేకాదు వారుండే ప్రాంతాన్నా తాలిబన్లు గతంలోనూ ఆక్రమించుకోలేదు. తాలిబన్లు అడుగు పెట్టడానికే భయపడుతున్న ఆ ప్రాంతం గురించి తెలుసుకుందామా..
కాబూల్ నగరానికి ఉత్తరాన 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పంజ్ షీర్. ఈ ప్రాంతంలో లక్షకు పైగా జనాభా ఉంటారు. చుట్టూ కొండలు, అడవులు ఈ ప్రాంతానికి రక్షణ గోడలాగా ఉంటాయి. పంజ్ షీర్ అంటే సంస్కృత భాషలో ఐదు సింహాలు అని అర్థం. పురాతన కాలంలో ఐదుగురు వ్యక్తులు వరదలను అడ్డుకునేందుకు ఓ ఆనకట్టను నిర్మించారట. అందునే వారి పేరు పెట్టుకున్నారు. ఇక పంజ్ షీర్ ప్రాంత వాసులు పోరాట పటిమ గలవారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో తెగింపు ఉంటుంది. తమకు అన్యాయం జరిగిన ప్రతీసారి కలిసికట్టుగా తిరుగబాటు ఉద్యమం చేస్తారు. 1980లో రష్యా దండయాత్రను తిప్పికొట్టడంలో, 2001లో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడడంలో వీరు ముందున్నారు.
అయితే వీరిలో అహ్మద్ షా మసూద్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈయన మిలటరీ కమాండర్. సోవియట్ దండయాత్రలో ప్రముఖంగా నిలిచాడు. వారికి వ్యతిరేకంగా ప్రతిఘటించాడు. 1990లో సైనిక విభాగానికి నాయకత్వం వహించాడు.1996లో అప్ఘాన్ తాలిబన్ల స్వాధీనంలోకి వెళ్లగా వారికి వ్యతిరేకంగా పోరాడాడు. 2001లో ఆయన యూరప్ న సందర్శించి తాలిబన్లను వ్యతిరేకంగా పోరాడడానికి మద్దతివ్వాలని కోరాడు. అయితే 2001 సెప్టెంబర్ 9న విలేకరులమని చెప్పి ఆల్ ఖైదాలను కలిసి ఆత్మహుతి దాడికి పాల్పడి చనిపోయాడు. ఆ తరువాత ఆమెరికాపై ఆల్ ఖైదాల దాడి, చివరకు నాటో దళాలు అప్ఘాన్ పై దాడి తెలిసిన విషయమే.
తాజాగా తాలిబన్లు అప్ఘాన్ ను ఆక్రమించిన నేపథంలో మరోసారి పంజ్ షీర్ వ్యతిరేక పోరాటానికి సిద్ధమవుతోంది. అహ్మద్ మసూద్ తనయుడు అహ్మద్ మసూద్, మొన్నటి వరకు అప్ఘాన్ ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సలేహ్ మరికొంత మంది తాలిబన్లకు వ్యతిరేకంగా ఉద్యమించాలని నిర్ణియించుకున్నారు. ఈ మేరకు చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. తాలిబన్లు అప్ఘాన్ ఆక్రమించుకోవడంతో దేశాధ్యక్షుడు అప్రష్ ఘనీ విదేశాలకు పారిపోయాడు. కానీ ఉపాధ్యక్షుడు మాత్రం దేశంలోనే ఉండిపోయాడు. అంతేకాకుండా తాము తాలిబన్లను వెళ్లగొడతామని ప్రతిఘటిస్తున్నాడు. ఇక అహ్మద్ మసూద్ సైతం తాన తండ్రిబాటలోనే వెళుతానని ప్రకటిస్తున్నాడు.
ఇక తాలిబన్లు తాము శాంతియుతంగా ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తూనే మరోవైపు షరీయా చట్టం అమలు చేస్తామని చెబుతున్నారు. దీంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఈ తరుణంలో ప్రస్తుతం అపద్ధర్మ అధ్యక్షుడిని నేనేనని, త్వరలోనే తాలిబన్లను దేశం నుంచి వెల్లగొడుతామని అమ్రుల్లా వర్గం చెబుతోంది. గతంలో తాలిబన్లు అప్ఘనిస్తాన్ ఆక్రమించుకున్న నేపథ్యంలోనూ తాలిబన్లు పంజ్ షీర్ పై అడుగు పెట్టలేదు. పంజ్ షీర్ కు చుట్టూ కొండలు, అడవులు ఉండడం వారికి ప్లస్ పాయింట్ అవుతుంది. ఎటువైపు నుంచి తమ ప్రాంతంలోకి వ్యతిరేకులు వచ్చినా వారు తిరుగుబాటు చేస్తారు. గెరిల్లా ఉద్యమాలు చేస్తూ శత్రువులతో పోరాడుతారు. ఈ నేపథ్యంలో పంజ్ షీర్ వాసులు ఈసారి తాలిబన్ల నుంచి ఎలా రక్షణ పొందుతారో చూడాలి.