Begin typing your search above and press return to search.

ఆడవాళ్ళ అవసరం ఏమిటో తేల్చేసిన తాలిబన్లు

By:  Tupaki Desk   |   10 Sep 2021 4:23 AM GMT
ఆడవాళ్ళ అవసరం ఏమిటో తేల్చేసిన తాలిబన్లు
X
ఆడవాళ్ళ అవసరం ఏమిటో తాలిబన్లు తాజాగా తేల్చిచెప్పారు. ఆడవాళ్ళున్నది ఇంట్లో కూర్చుని పిల్లలు కనటానికి తప్ప ఇంక దేనికీ కాదన్నారు. పిల్లల్ను కనటానికే ఆడవాళ్ళు కానీ క్యాబినెట్ లో కూర్చుని దేశాన్ని ఏలటానికి కాదని తాలిబన్ అధికార ప్రతినిధి సయాద్ జక్రుల్లా హష్మీ ప్రకటించారు. మొత్తంమీద తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఆఫ్ఘనిస్ధాన్లో ఆడవాళ్ళ స్ధానమేంటో తాలిబన్లు తేల్చిచెప్పారు. మరి తమ ప్రభుత్వంలో ఆడవాళ్ళు కూడా ఉంటారని ఈమధ్యలో ఎందుకు ప్రకటించారో అర్థం కావటం లేదు.

తాలిబన్ల తాజా వైఖరితో దేశంలో మహిళల పరిస్థితి ఏమిటో ప్రపంచదేశాలకు స్పష్టంగా అర్ధమైపోయింది. ఇప్పటికే మహిళలు ఒంటరిగా ఇల్లు వదిలి బయటకు వచ్చేందుకు లేదనే ఆదేశాలు అమల్లో ఉన్నాయి. అవసరమై ఆడవాళ్లు బయటకు రావాలని అనుకుంటే కుటుంబసభ్యుల్లో ఎవరైనా ఒక మగాడు తోడు లేకుండా ఇల్లు దాటేందుకు లేదు. ఒకవేళ అలా ఒంటరిగా మహిళలు అడుగు బయట పెడితే అంతే సంగతులు.

బురఖా లేకుండా బయటెక్కడా మహిళలు కనబడకూడదు. నెయిల్ పాలిష్ వేసుకోకూడదనే ఆదేశాలు కూడా ఉన్నాయి. నెయిల్ పాలిష్ వేసుకుని చేతులంతా బయటకు కనబడేట్లు బట్టలు వేసుకున్న ఓ మహిళను తాలిబన్లు పట్టుకుని వేళ్ళు నరికేసిన ఘటన సంచలనం సృష్టించింది. మహిళలు ఎవరు ఉద్యోగాలు చేయకూడదని కూడా ఉత్తర్వులు జారీచేశారు. ఉద్యోగాలు చేసే మహిళల తలలు భారంగా మారిపోతాయట. దీని ప్రభావం వల్ల ఇంట్లో పనుల మీద పడుతుందట. అందుకనే మహిళలు ఉద్యోగాలు చేయటాన్ని నిషేధించారు.

ఇక నిరసనలు, ఆందోళనలు చేయడం కూడా నిషేధమే. ప్రభుత్వ ఆదేశాలను ఎవరు ఉల్లంఘిచినా ఎలాంటి విచారణలు అవసరం లేదట. ఏకంగా కాల్చి చంపేయటమే అని స్పష్టంగా చెప్పారు. నలుగురు చేరి బహిరంగ ప్రదేశాల్లో నినాదాలు చేయటం ఇకపై దేశంలో తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ విచిత్రమేమిటంటే ముందుగా అనుమతులు తీసుకున్న ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలను మాత్రమే అనుమతిస్తామని చెప్పటం. ఒక వైపేమో నిరసనలు, ఆందోళనలు నిషేధమంటునే మరోవైపు అనుమతి ఇస్తామని చెప్పటమే.