Begin typing your search above and press return to search.
రాజాచారి.. ఈ తెలుగోడు ఇప్పుడు మనకే కాదు.. దేశానికే గర్వకారణం
By: Tupaki Desk | 12 Nov 2021 5:30 AM GMTఅంతరిక్ష పరిశోధనల కోసం 1998లో ఆకాశంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయటం..వివిధ పరిశోధనల కోసం తరచూ వ్యోమోగాముల్ని భూమి నుంచి అక్కడకు పంపటం తెలిసిందే. తాజాగా అమెరికా నుంచి అలాంటి టీం ఒకటి తాజాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లింది. అక్కడకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన స్పేస్ షిఫ్ ను.. టెస్లా కార్ల అధినేత ఈలన్ మస్క్ కు చెందిన స్పెస్ ఎక్స్ సంస్థ సమకూర్చింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా వెళ్లిన నలుగురు సభ్యులున్న టీంకు నేతృత్వం వహిస్తున్నది ఎవరో తెలుసా? 44 ఏళ్ల రాజాచారి. అవును.. ఒక తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా మూలాలు ఉన్న అతడు.. అతడి వెంట వెళ్లిన వారంతా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆర్నెల్లు ఉండనున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. గడిచిన 48 ఏళ్ల కాలంలో ఒక అనుభవం లేని వ్యక్తి నాసా మిషన్ కు నేతృత్వం వహించటం ఇదే తొలిసారి.
కాకుంటే రాజాచారి ప్రత్యేకత ఏమంటే.. అతను ఫైటర్ జెట్ విమానాల్ని నడపటంలో 2500 గంటల అనుభవం ఉంది. ఇంతకీ ఈ తెలుగోడి బ్యాక్ గ్రౌండ్ మరింత ఆసక్తికరంగా ఉంటుందనిచెప్పాలి. ఆయన తాతముత్తాతలు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారు. వారి తాతాగారి హయాంలోనే వారి ఫ్యామిలీ హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యింది. రాజాచారి తాత ఉస్మానియా వర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్ గా పని చేశారు. ఆయన కొడుకు శ్రీనివాసాచారి ఓయూలో ఇంజనీరింగ్ చేసి 1970లలో ఉన్నతచదువుల కోసం అమెరికాకు వెళ్లారు.
అక్కడే తనకు పరిచయమైన పెగ్గీ ఎగ్బర్ట్ ను పెళ్లాడారు. వారికి పుట్టిన వాడే రాజాచారి. 1977లో పుట్టిన ఆయన.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. కొలరాడోలోని యూనైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్సు అకాడమీలో ‘బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఆస్ట్రొనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఇంజనీరింగ్ సైన్స్’, కేంబ్రిడ్జిలోని ప్రతిష్ఠాత్మక మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ పూర్తి చేశారు.
పలు సంస్థల్లో శిక్షణ పొంది.. అమెరికా వాయుసేనలో చేరారు. ఆ తర్వాతి కాలంలో రోదసియానంపై ఆసక్తి పెరగటంతో నాసా ఆస్ట్రోనాట్ గ్రూప్ 22 మిషన్ కు దరఖాస్తు చేశారు. ఈ ప్రోగ్రాంలో పాల్గొనటానికి మొత్తం 18,300 అప్లికేషన్లు రాగా.. 12 మందిని తుది ఎంపిక చేశారు. వారిలో రాజాచారి ఒకరు. 2017 నుంచి నాసా ఈ పన్నెండు మందికి రోదసియానం మీద శిక్షణ ఇచ్చింది. గత ఏడాది డిసెంబరులో రాజాచారిని ‘ఆర్టెమిస్’ టీంలో ఎంపిక చేశారు.
ఇదో ప్రత్యేకమైన ప్రాజెక్టు. అప్పుడెప్పుడో అపోలోతో ఆపేసిన చంద్రయానాన్ని పునరుద్దరించేందుకు చేపట్టిందే ఈ మిషన్. ఇందులో 18 మంది ఉండగా..వారిలో ఇద్దరు 2024లో చంద్రుడిపై అడుగు పెట్టనున్నారు. అనంతరం ఈ టీంలోని ఒకరికి కుజుడి మీదకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ.. ఈ రెండింటిలో దేనికి రాజాచారి ఎంపికైనా తెలుగు వారికి గర్వకారణమేనని చెప్పాలి.
అమెరికాలో పుట్టి పెరిగిన రాజాచారి భారత్ కు వచ్చింది చాలా చాలా తక్కువ. 2005లో బెంగళూరులో జరిగిన ఒక ఎయిర్ షోలో పాల్గొనేందుకు అమెరికా నుంచి వాయుసేన పైలెట్ గా వచ్చారు. ఆ సమయంలోనే తనకు నాయనమ్మ వరుస అయ్యే అంబుజాదేవిని కలిసేందుకు హైదరాబాద్ కు వచ్చారు. ఇక.. రాజాచారి సతీమణి హాలీ షాఫ్టర్ అమెరికాకు చెందిన వ్యక్తే. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మొత్తానికి ఒక తెలుగువాడు రోదసిలో అడుగుపెట్టిన వైనం తెలుగు వారికి సరికొత్త స్పూర్తిని ఇస్తుందనటంలో సందేహం లేదు.