Begin typing your search above and press return to search.

మామూలుగా అయితే అంత రచ్చ.. కవిత విషయంలో అంత సైలెంటా?

By:  Tupaki Desk   |   12 Dec 2022 1:30 PM GMT
మామూలుగా అయితే అంత రచ్చ.. కవిత విషయంలో అంత సైలెంటా?
X
ఢిల్లీ లిక్కర్ స్కాం బయటకు రావటం.. అక్కడెక్కడో ఉన్న దేశ రాజధానిలో జరిగిన కుంభకోణంపై తెలుగు మీడియా పెద్దగా పోకస్ పెట్టింది లేదు. ఆ తర్వాతి కాలంలో అనూహ్యంగా ఎమ్మెల్సీ కవిత పేరు తెర మీదకు రావటం తెలిసిందే. ఈ విషయాన్ని సైతం తెలుగు మీడియా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒకట్రెండు ప్రముఖ మీడియా సంస్థలు కాస్తంత హడావుడి చేసినా.. వాటికి సహజ సిద్దంగా ఉండే లక్షణాలకు భిన్నంగా వ్యవహరిస్తూ.. ఆ ఎపిసోడ్ ను మమ అనిపించారన్న ఆరోపణ బలంగా వినిపిస్తోంది.

ఇదే విషయాన్ని కొందరు ప్రస్తావిస్తూ.. ఢిల్లీ లిక్కర్ స్కాం తరహా ఉదంతమే కానీ దివంగత మహానేత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగి ఉంటే ఎలా ఉండేది? ఒక్కసారి ఊహించమని అడుగుతున్నారు. చీమ చిటుక్కుమన్నా.. దానికి చిలువలు వలువలు చేసి రాతలు రాసేయటమే కాదు.. ఒక భారీ భూతద్దాన్ని పట్టుకొని అనువణువు వెతికి మరీ వాటి విచారణ రిపోర్టుల్ని వార్తలుగా.. వాస్తవాలుగా కుప్పలు తెప్పలుగా అచ్చేవారన్న మాట వినిపిస్తోంది.

అదేం సిత్రమో కానీ.. కవిత ఎపిసోడ్ విషయానికి వస్తే.. విచారణ సంస్థలు.. అధికారులు.. దర్యాప్తుల్లో భాగంగా వెలుగు చూసిన వార్తల్ని మాత్రమే మీడియా ముందుకు వస్తున్నాయే తప్పించి.. సొంతంగా ఎలాంటి విచారణ జరగటం లేదన్న మాట వినిపిస్తోంది. కొందరి విషయంలో విపరీతమైన ఆసక్తి.. అంతకు మించిన ఆత్రుతను ప్రదర్శించే ప్రధాన మీడియా సంస్థలు మరికొందరి విషయంలో మాత్రం 'మ్యాటర్ ఆఫ్ ద ఫ్యాక్ట్' అన్న సూత్రానికి అడుగు కూడా ముందుకు జరగని విధంగా ఎలా వ్యవహరిస్తారు? అన్నది ప్రశ్నగా మారింది.

అయితే.. ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతికినప్పుడు ఆసక్తికర వాదనలు వినిపిస్తూ ఉంటాయి. అందులో ప్రధానమైనది మీడియా విషయంలో చంద్రబాబు అనుసరించే పద్దతి.. విధానాన్ని ఆయనకు ఒకప్పటి శిష్యుడిగా వ్యవహరించిన కేసీఆర్.. బాబు టెక్నిక్ ను బాగానే వంట బట్టించుకున్నారని చెబుతారు. ఎవరిని.. ఎప్పుడు.. ఎలా వ్యవహరిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయన్నది బాగా తెలుసంటారు. ఇందుకు తగ్గట్లే బాబు టెక్నిక్ ను మరింత ఇంప్రూవైజ్ చేసిన కేసీఆర్ దాన్ని తనదైన పార్ములాను సిద్ధం చేశారంటారు. అదే ఆయనకు శ్రీరామరక్షగా మారిందంటున్నారు. గడిచిన ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో ఒక్కటంటే ఒక్క కుంభకోణం కూడా చోటు చేసుకోలేదా? అని ప్రశ్నించేవారెందరో.

ఈరోజున ప్రధాన మంత్రి మోడీ మొదలు కేంద్రంలోని ప్రతి మంత్రులే కాదు.. వివిధ స్థాయిల్లో ఉన్న వారందరి నోటినుంచి ఇటీవల కాలంలో తెలంగాణరాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అవినీతితోపాటు పలు అంశాల్ని ప్రస్తావిస్తున్నారు. మరి.. వేరే వారి విషయంలో అంతటి అత్యుత్సాహం ఎందుకు ? అన్నది ప్రశ్నగా వినిపిస్తోంది. అయితే.. ఈ విషయంలో చంద్రబాబుటెక్నిక్ ను మరింత ఎఫెక్టివ్ గా వాడే విషయంలో కేసీఆర్ ను మెచ్చుకోవాల్సిందేనని చెప్పక తప్పదు. తాజాగా కవిత విషయంలోనూ అలాంటి పరిస్థితే ఉందన్న అభిప్రాయం వ్యక్తం కావటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.