Begin typing your search above and press return to search.
థర్డ్ వేవ్ లో ఇంటికొకరు చస్తారన్న పరుచూరి మల్లిక్ కు షాకిచ్చిన తెలంగాణ సర్కార్
By: Tupaki Desk | 15 Jun 2021 5:30 AM GMTరోనా సెకండ్ వేవ్ దేశంలో మరణ మృదంగం వాయించిందని.. లక్షల మంది చనిపోయారని పత్రికలు, మీడియా ఘోషించింది.. అది లాక్ డౌన్ తో ప్రస్తుతం కట్టడి అయ్యింది. ఇప్పుడు సెకండ్ వేవ్ విధ్వంసాన్ని మరువకముందే థర్డ్ వేవ్ రానుందన్న భయం ప్రజలను వెంటాడుతోంది.
థర్డ్ వేవ్ ఇంకా భయంకరంగా ఉండనుందంటూ పలువురు నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలు కూడా మరింత గందరగోళానికి, భయాందోళనకు దారితీస్తున్నాయి. తాజాగా ఓ టీవీ చానెల్ డిబేట్ లో థర్డ్ వేవ్ గురించి పరుచూరి మల్లిక్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోంది. ‘థర్డ్ వేవ్ వస్తే ఇంటికొకరు చస్తారు. జబ్బుతో శరీరం కుళ్లిపోతుంది. భయపెడుతున్నాననుకున్న ఫరవాలేదు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనమయ్యాయి. దీనిపై తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ సీరియస్ అయ్యింది.
కోవిడ్ -19 మూడవ వేవ్ గురించి దారుణ వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజలలో భయాందోళనలు కలిగించినందుకు మల్లిక్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాస్ రావు సోమవారం పోలీసు ఫిర్యాదు చేశారు.
సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు., పరుచురి మల్లిక్ ఒక టెలివిజన్ ఛానెల్లో ఒక డిబేట్ లో పాల్గొన్నప్పుడు, మూడవ వేవ్ కు సంబంధించి వైద్య నీతి పరంగా చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. సాధారణ ప్రజలలో భయాందోళనలు ఇవి సృష్టిస్తాయి అని తెలిపారు.
శ్రీనివాస రావు తన ఫిర్యాదులో మల్లిక్ సబ్జెక్ట్ నిపుణుడు కాదని, ప్రజలలో భయాందోళనలకు దారితీసే తప్పుడు హెచ్చరికలను వ్యాప్తి చేసినందుకు జాతీయ విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 54 కింద చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఫిర్యాదును పరిశీలిస్తున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
"రాబోయే మూడో వేవ్.. కుటుంబాలు లేదా పిల్లలపై దాని ప్రభావం చూపలేదు. దీని గురించి ఏ సంస్థ / వ్యక్తి కూడా తేల్చలేదు. ప్రపంచవ్యాప్తంగా కూడా అనుభవం / శాస్త్రీయ అంచనా లేదు" అని ఫిర్యాదులో శ్రీనివాసరావు తెలిపారు.
ఆధారాలు లేకుండా.. శాస్త్రీయ మద్దతు లేని పుకార్లను అనవసరంగా వ్యాప్తి చేయడం ఖచ్చితంగా సామాన్యులకు భయాందోళనలు కలిగిస్తాయని.. వారిని బాధ పెడుతుందని చెప్పారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, మాలాఫైడ్ ఉద్దేశాలతో మాట్లాడడం స్థూల నేరపూరిత చర్యకు సమానం, ప్రచారం పొందడం కోసం.. ప్రజాదరణ ఇలాంటి కామెంట్స్ చేస్తే సహించం అని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ అధికారి స్పష్టం చేశారు. మల్లిక్ ప్రసంగాన్ని పుకార్లను నమ్మవద్దని శ్రీనివాస్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఆసుపత్రి పడకలు, మందులు, ఆక్సిజన్ ఏర్పాటు.. వైద్యసిబ్బంది ఎక్కువమందిని నియమించామని.. మూడవ వేవ్ కోసం రాష్ట్రం సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు.