Begin typing your search above and press return to search.
అప్పుల కోసం తెలంగాణ తిప్పలు మామూలుగా లేవుగా!
By: Tupaki Desk | 5 July 2022 4:36 AM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ ఆయువుపట్టుపై కొడుతూ ఆటాడుకుంటున్నాడు ప్రధాని మోడీ. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారడం.. ఈనెల జీతాలకు కష్టమైపోతున్న పరిస్థితుల్లో మరో గట్టి షాక్ లు ఇస్తున్నాడు మోడీ. ఇప్పటికే ఎక్కడా తెలంగాణ ప్రభుత్వానికి అప్పు పుట్టకుండా ఆంక్షలు విధించిన మోడీ సర్కార్.. ఎంత బతిమిలాడుతున్నా కనికరించడం లేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ మోడీని ఎదురిస్తుండడంతో అంతే స్థాయిలో కేంద్రం తెలంగాణ ఆర్థిక పరిస్థితులపై గట్టి దెబ్బలు కొడుతోంది.
దేశంలోనే సంపన్న రాష్ట్రం అప్పుల కోసం అగచాట్లు పడుతోంది. అప్పులు కావాలంటూ కేంద్రాన్ని మొర పెట్టుకుంటోంది. అసలు తగ్గేదే లే అని కేంద్రంతో కొట్లాడుతున్న కేసీఆర్ సర్కార్ అదే కేంద్రంపై యుద్ధానికి రెడీ అవుతోంది. తాజాగా రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి అప్పు ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని వేడుకుంటోంది. ఈ మేరకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద మంజూరైన రోడ్లకు కేంద్రం అప్పు ఇస్తేనే పనులు చేయగలమంటూ లేఖ రాసింది. పంచాయతీరాజ్ ఈఎన్సీ నుంచి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీకి ఈ లేఖ పంపించారు.
నక్సల్స్ ప్రభావిత జిల్లాలతోపాటు 32 జిల్లాలకు పీఎంజీఎస్వై కింద మూడు విడతల్లో మంజూరైన రోడ్లను పూర్తి చేసేందుకు రూ.967.61 రుణం కావాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ పథకం కింద రోడ్లు నిర్మించేందుకు రాష్ట్ర వాటా 40శాతం వెచ్చించేందుకు నిధులు లేవని స్పష్టం చేసింది. దీంతోపాటు రెండేళ్ల క్రితం రాష్ట్రానికి మంజూరు చేసిన రోడ్లకు సైతం ప్రైస్ ఎస్కలేషన్ ఇవ్వాలని లేఖలో కోరారు.
పీఎంజీఎస్వైఫేస్ కింద రూ.241.26 కోట్లు మాత్రమే ఇచ్చారని వాటికి సంబంధించిన ధరలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. 2020లో ఇచ్చిన ఈ రోడ్లకు ఇప్పుడు సగటున 16శాతం ధరలు పెరిగాయని పరిపాలన అనుమతి ఖర్చు సగటున 21 శాతం పెరిగిందని స్పష్టం చేసింది. స్టీల్ , ఇసుక, సిమెంట్ ధరల ప్రకారం అదనంగా మరో 51.52 కోట్లు విడుదల చేయాలని కోరింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెరిగిన ధరల వివరాలను కేంద్రానికి వెల్లడించింది.
తెలంగాణ ప్రభుత్వం అప్పులు తీసుకునేందుకు కేంద్రప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. దీంతో కరోనా తర్వాత అతలాకుతలమైన రాష్ట్ర సర్కార్ కు ప్రతీ నెల ఒక గండంలా గడుస్తోంది. క్లిష్టమైన ఈ జూన్ నెలను కేసీఆర్ సర్కార్ ఎలా అధిగమిస్తుందన్నది కీలకంగా మారింది.
జూన్ లో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు, వడ్డీలు, రైతు బంధుకు డబ్బులు వేయడం కేసీఆర్ సర్కార్ తలకు మించిన భారంగా మారింది. నిధుల సేకరణ కానకష్టంగా మారడంతో ఆర్థికశాఖ ఆందోళన చెందుతోంది. జూన్ లోనే సుమారు రూ.20వేల కోట్లు చెల్లించాల్సినవే ఉండడంతో సర్దుబాటు ఎలా అన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది.