Begin typing your search above and press return to search.

ఒకే భవనంలో పదహారు మతాలు

By:  Tupaki Desk   |   19 Aug 2016 10:30 PM GMT
ఒకే భవనంలో పదహారు మతాలు
X
మ‌త సామ‌ర‌స్య‌త‌కు ఇదో చిహ్నం. రష్యాలోని కజన్ నగరంలో వివిధ మతాలకు చెందిన పార్థనా మందిరాలు ఒకే భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. హిందూ దేవాలయం - మసీదు - చర్చి - గురుద్వారా... ఇలా ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన 16 మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలన్నీ ఇక్కడ ఒకే చోట చూడవచ్చు. ఈ నిర్ణ‌యం ద్వారా ప్ర‌పంచం చూపును ర‌ష్యా ఆక‌ర్షిస్తోంది.

ర‌ష్యాకు చెందిన ఇడర్ ఖానొవ్ అనే ఓ సంఘ సంస్కర్త ఈ విధంగా 16 మ‌తాల‌కు చెందిన‌ ఆలయాలను ఒకే చోట నెలకొల్పుతున్నాడు. దీనికి టెంపుల్ ఆఫ్ ఆల్ రెలిజియన్స్ అని పేరు పెట్టారు. కజన్ నగరంలో మద్యపానం - ధూమపానం మాన్పించే రిహాబిలిటేషన్ కేంద్రాన్ని నిర్వహించే ఇడర్ ఖానొవ్ ఓ కళాకారుడు కూడా. మతాలన్నిటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఈ అద్భుత నిర్మాణాన్ని చేపట్టాడు. ఈ నిర్మాణానికి 1992లో శ్రీకారం చుట్టాడు. ఒకే చోట 16 మందిరాల గోపురాలను చూపిస్తూ భిన్నత్వంలో ఏకత్వం చూపాలని భావిస్తున్నాడు. భవన నిర్మాణ పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఖానొవ్‌ కు విరాళాలు ఇచ్చేవారు పెద్ద సంఖ్యలోనే ముందుకు వస్తున్నారు. విరాళాల ద్వారానే ఆయన ఈ భవన నిర్మా ణ పనులు కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఈ భవనాన్ని పర్యాటకులు చూసే అవకాశం లేదు. త్వరలోనే ఈ భవన నిర్మాణ పనులు పూర్తవుతాయట. ఇందులో ఏ మతానికి సంబంధించిన ప్రార్థనలూ కొనసాగవు. సంస్కృతీ సంప్రదాయాలను చూపేందుకు - భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటేందుకు మాత్రమే ఈ నిర్మాణాన్ని చేపట్టాన‌ని ఖానోవ్ చెప్తున్నాడు.