Begin typing your search above and press return to search.
గాంధీ కుటుంబం తప్పిదం వల్లనే మునుగోడులో థర్డ్ ప్లేస్
By: Tupaki Desk | 29 Aug 2022 8:48 AM GMTనల్గొండలో ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ కి ఓటు బ్యాంక్ ఉంది. ఇక నల్గొండ జిల్లాలో రెండు ఎంపీ సీట్లను కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంది. ఇక కోమటిరెడ్డి ఫ్యామిలీ చూస్తే అక్కడ గేమ్స్ అడుతోంది అని అక్కడ కాంగ్రెస్ లోని అందరూ చెబుతున్నా ఆ పార్టీ హై కమాండ్ మాత్రం వినడంలేదు. ఒక వారం క్రితం నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ కి మునుగోడులో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అయితే ఇప్పటిదాకా మునుగోడు సీటు ఎవరికి ఇస్తారో తెలియదు కాబట్టి దీంతో బీజేపీలోకి జంప్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందరికీ బేరం పెట్టి మరీ కాంగ్రెస్ లోని వారిని లాగేస్తున్నాడు అంటున్నారు.
ఇక టీయారెస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ల క్యాడర్ వాళ్ళ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి గులాబీ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదు. దాంతో ఉప ఎన్నికల్లో ఫస్ట్ ప్లేస్ లేదా సెకండ్ ప్లేస్ టీయారెస్ కి రావడం ఖాయం. ఇక ఇంత పెద్ద ఎత్తున బలం ఉండి కూడా కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్ లోని వెళ్తోంది అంటే అది కేవలం కాంగ్రెస్ లో గాంధీ కుటుంబం రాజకీయాల వల్లనే అని అంటున్నారు. ఈ మాట దేశమంతా చెబుతోంది.
ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కానీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కానీ మునుగోడు మొత్తం బాధ్యతలు అప్పగిస్తే వారు గెలిచే క్యాండిడేట్ ని ఎంపిక చేసి కోమటి రెడ్డి వెంకట రెడ్డికి ఈ బాధ్యతలు పెత్తనం అప్పగిస్తే ఆయన తన తమ్ముడిని ఓడించే బలమైన క్యాండిడేట్ ని నిలబెడతారా అన్న చర్చ సాగుతోంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తమ్ముడిని గెలిపించే కార్యక్రమాన్ని ఇంట్లో నుంచే చేస్తున్నారు అని అంటున్నారు.
ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ తమ కాంట్రాక్టుల కోసం జాతీయ పార్టీలో ఉండడం బెటర్ అనే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. అంటే ఏతా వాతా తేలదేది ఏంటి అంటే మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజోగోపాల్ గెలిస్తే అది బీజేపీ గెలుపు అవుతుంది.
ఆ మీదట కోమటి రెడ్డి వెంకటరెడ్డి స్టెప్స్ కూడా ఎలా ఉంటాయో అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి కాంగ్రెస్ అధినాయకత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్లనే బంగారం లాంటి మునుగోడు సీటు గెలిచే సీటు కూడా ఇపుడు ఓడిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంటున్నారు. మరి దీనికి గాంధీ కుటుంబమే కారణం అంటే తప్పుందా అన్నదే అందరి మాట కూడానట.
అయినా కాంగ్రెస్ పెద్దలు జాతీయ స్థాయిలో చేస్తున్న తప్పుల వల్లనే గ్రాస్ రూట్ లెవెల్ లో కూడా తగిన మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది అని అంటున్నారు. మొత్తానికి మునుగోడు లో హస్తాన్ని ముంచేది ఎవరు అంటే జవాబు చెప్పడానికి ఇపుడు బహు సులువే మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.