Begin typing your search above and press return to search.

మూడోసారి.. క‌ష్ట‌మే గురూ..: వైసీపీలో గుస‌గుస‌

By:  Tupaki Desk   |   24 Oct 2022 6:50 AM GMT
మూడోసారి.. క‌ష్ట‌మే గురూ..:  వైసీపీలో గుస‌గుస‌
X
ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా.. గెలుపు మాదే.. అనే ప‌రిస్థితి వైసీపీలో చాలా మందికి లేకుండా పోయింది. ఎందుకంటే.. కేవ‌లం ఎన్నిక‌లు కాదు.. అభివృద్ది చేసి చూపించి ఎన్నిక‌ల‌కు వెళ్ల‌క‌పోతే..ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌న్న భ‌యం నాయ‌కుల‌ను వెంటాడుతోంది. మ‌రీ ముఖ్యంగా వ‌రుస విజ‌యాలు ద‌క్కిం చుకున్న‌వారికి.. ఇప్పుడు మూడో సారి విజ‌యంపై ఒకింత అనుమానం వ్య‌క్త‌మ‌వుతోంది. దీనిపై అధికార పార్టీలో త‌ర్జ‌న భ‌ర్జ‌న కూడా కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఎందుకంటే.. రెండు సార్లు గెలిపించాం.. క‌దా.. ఈసారి వేరే నాయ‌కుడికి అవ‌కాశం ఇవ్వాల‌నే ధోర‌ణి.. ప్ర‌జ ల్లో వ‌స్తోంది. దీనికి తోడు.. ప్ర‌త్య‌ర్థి పార్టీల నాయ‌కులు కూడా ఓ రేంజ్‌లో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీం తో స‌హ‌జంగానే అధికార పార్టీ నేత‌ల్లో ఒకింత అల‌జ‌డి ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది. ఒక‌వైపు.. అధినేత సీఎం జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌మంటున్నారు. మంచిదే. కానీ, క‌నీసం.. ఒక రొడ్డు వేయించే ప‌రిస్థితి లేదు క‌దా! అని నాయ‌కులు త‌ల ప‌ట్టుకుంటున్నారు.

"ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండేందుకు మాకు ఇబ్బంది లేదు. కానీ.. ఎక్క‌డికి వెళ్లినా.. ప్ర‌జ‌లు స‌మ‌స్య‌లు ప్ర‌స్తావిస్తు న్నారు. అవి చూస్తే.. మాకు కూడా నిజ‌మేన‌ని అనిపిస్తుంది. వాటిని చూపించి.. యాగీ చేస్తున్న‌వారు కొంద రు.. నిల‌దీస్తున్న‌వారు మ‌రికొంద‌రు ఉన్నారు. అందుకే.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాలంటే.. ఒకింత భ‌యం వేస్తోంది" అని కొంద‌రు ఎమ్మెల్యేలు ఆఫ్ దిరికార్డుగా వ్యాఖ్యానించారు. మ‌రికొంద‌రు కూడా ఇదే అభిప్రా యం వ్య‌క్తం చేశారు.

అయితే.. జ‌గ‌న్ మాత్రం.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని అంటారు. స‌రే.. ఈ వివాదం ఇలా ఉంటే.. ప్ర‌జ‌ల మ‌ధ్యకు వ‌స్తున్న పార్టీల‌ను చూస్తే.. టీడీపీ కూడా దూకుడుగానే ఉంది. అయితే.. టీడీపీ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేస్తోంది. ఇదేస‌మ‌యంలో జ‌గ‌న్ అభివృద్ధిపైనా.. సంక్షేమంపైనా..

ప్ర‌జ‌ల‌ను చైతన్యం చేయాల‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో అటు నాయ‌కులు.. ఇటు జ‌గ‌న్ కూడా.. స‌రైన వ్యూహంతో ముందుకు సాగ‌డం లేదా.. అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏదేమైనా.. ఇప్పుడు.. వైసీపీ ఒక సంక్లిష్ట భ‌రిత వాతావర‌ణంలో ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనినే వైసీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకున్న‌వారు చెబుతున్నారు. మూడో సారి గెలుపు గుర్రంఎక్క‌డం క‌ష్ట‌మేన‌ని.. ఏదైనా అద్భుతం జ‌రిగితే త‌ప్ప‌.. త‌మ పంట పండ‌ద‌ని వాపోతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.