Begin typing your search above and press return to search.
మమ్మల్ని కొనసాగించకపోతే కోర్టుకెళ్తాం.. టీడీపీ ఎమ్మెల్సీలు!
By: Tupaki Desk | 2 July 2021 2:30 AM GMTఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సభ్యులుగా ఉన్న ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీల పదవీకాలం త్వరలో ముగియనుంది. వారిలో బాబూ రాజేంద్రప్రసాద్, జగదీష్, సుబ్రహ్మణ్యం ఉన్నారు. అయితే.. వీరికి కాస్త ముందుగానే రిటైర్మెంట్ ఇవ్వాలని అసెంబ్లీ అధికారులు నిర్ణయించారు. గత నెల 18వ తేదీన మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్సీలు రిటైర్ అయినట్టు అసెంబ్లీ వర్గాలు ప్రకటించాయి. ఇందులో ఈ ముగ్గురు కూడా ఉన్నారు.
అయితే.. కరోనా నేపథ్యంలో ప్రస్తుత రిటైర్మెంట్ పెండింగ్ లో ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఎన్నికల సంఘం ఆదేశాలు అమలు చేయకుండా.. తమకు ముందుగానే రిటైర్మెంట్ ఇప్పించారని ఈ ముగ్గురు ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. తమను కొనసాగించాలని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ కూడా రాశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం.. ఆగస్టు 11 వరకు తమను కొనసాగించాలని ఆ లేఖలో కోరారు. సీఈసీ ఆర్డర్ కు విరుద్ధంగా తమను ముందుగానే పదవీ విరమణ చేయించారని, ఇది అన్యాయమని వారు అంటున్నారు. ఈ విషయంలో అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకు సైతం సిద్ధమవుతున్నట్టు సమాచారం. మరి, దీనిపై అసెంబ్లీ వర్గాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.