Begin typing your search above and press return to search.
కేసీఆర్ కాకుండా ఈటలను టార్గెట్ చేసిన ముగ్గురు ఎవరంటే...
By: Tupaki Desk | 3 Jun 2021 3:30 AM GMTటీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఊహించిన విధంగానే బీజేపీ తీర్థం పుచ్చుకోబోతుండటం అనుకున్నట్లే ఖాయం అయిపోయింది. ఈటల బీజేపీలో చేరడం ఖాయమవడంతో ‘ఆపరేషన్ హుజూరాబాద్’ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయనున్నారు. అయితే, ఈ సమయంలో ఓ ముగ్గురు నేతలు ఈటల ను ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు.
బీజేపీలో చేరడానికి ముందు ఈటల ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంది. కరోనా ఉద్ధృతి తగ్గిన తర్వాత తన పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే ఈటల ప్రకటించారు. రెండు, మూడు రోజుల్లో ఈ తంతు కూడా పూర్తి చేస్తారని తెలుస్తోంది. రాజీనామా చేసిన తరువాత బీజేపీలో అట్టహాసంగా చేరాలని భావిస్తున్నా, కోవిడ్ కారణంగా కొద్దిమందితోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. ఈటల రాజీనామా స్పీకర్ కు పంపిస్తే.. దానికి ఆమోదం లభించే అవకాశం ఉంది. దీంతో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. రాజీనామా చేసిన ఆరునెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు అమలు చేస్తోంది.
ఇప్పటికే టీఆర్‌ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ ప్రజాప్రతినిధులెవరూ ఈటల వెంట వెళ్లకుండా కట్టడి చేస్తోంది. ఈటల పార్టీ మారనుండడంతో హుజూరాబాద్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ఈటల రాజేందర్ 17 ఏళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్‌పై టీఆర్‌ఎస్‌కు పట్టు సడలలేదని చెప్పేందుకు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ ఇప్పటికే నేతలతో సమావేశం అవుతున్నారు. త్వరలోనే ఈ నియోజకవర్గంలో తిష్టవేసి కార్యక్రమాలను కొనసాగించనున్నారని సమాచారం. మండలాల వారీగా నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయడం, అయిన పనులకు సంబంధించి బిల్లులు మంజూరు చేయించడంతోపాటు పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామనే సంకేతాలు పంపించనున్నారు. ఈ ముగ్గురు నేతల అండతో ఆపరేషన్ హుజురాబాద్ నిర్వహిస్తారని అంటున్నారు.