Begin typing your search above and press return to search.
పాడు డబ్బులతో పోయే కాలం.. తల్లి మీద పెట్రోల్ చల్లేసి నిప్పు పెట్టేశాడే
By: Tupaki Desk | 28 March 2022 5:02 AM GMTచాలా దుర్మార్గాలకు.. దారుణాలకు డబ్బే ప్రధాన కారణంగా నిలుస్తుంటుంది. పాపిష్ఠి డబ్బు కోసం దేనికైనా తెగించేవారెందరో. తాజా ఉదంతాన్ని చూస్తే ఇదే విషయం కళ్లకు కట్టినట్లు అర్థమవుతుంది. చేతికి వచ్చిన డబ్బును తన చేతుల్లో పెట్టలేదన్న కోపంతో ఒక కొడుకు తన తల్లిదండ్రుల విషయంలో ఎంత దారుణంగా వ్యవహరించాన్నది చూస్తే.. కోపం తన్నుకు రావటం ఖాయం. సిద్ధిపేట జిల్లా దౌల్లాబాద్ మండలంలో చోటు చేసుకున్న ఈ దారుణంలోకి వెళితే..
65 ఏళ్ల మైసయ్య.. 60 ఏళ్ల పోశవ్వకు ఇద్దరు కొడుకులు.. ఒక కుమార్తె ఉన్నారు. ఒక ప్రమాదంలో వీరి చిన్న కొడుకు మరణించాడు. మిగిలిన ఇద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి. పెద్ద కొడుకు బాలమల్లు తల్లిదండ్రులతో కాకుండా విడిగా ఉంటున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా మైసయ్య తనకున్న మూడు గుంటల భూమిని అమ్మటం.. దానికి రూ.2లక్షలు వచ్చాయి.
భూమి అమ్మగా వచ్చిన రూ.2లక్షల్లో ఒక లక్షను కొడుకు బాలమల్లుకు ఇచ్చి.. మరో లక్ష రూపాయిల్ని తన వద్ద ఉంచుకున్నాడు. భూమి అమ్మగా వచ్చిన మరో లక్షను కూడా తనకు ఇవ్వాలని గొడవ పడ్డాడు. ఆరోగ్యం బాగోలేదని.. వైద్య ఖర్చుల కోసం రూ.లక్షను తమ వద్ద ఉంచుకున్నట్లుగా ఎంత చెప్పినా వినని బాలమల్లు.. డబ్బుల కోసం దారుణానికి తెగబడ్డాడు.
ఆదివారం ఉదయం ఇంటికి వచ్చిన బాలమల్లు.. డబ్బుల కోసం కన్నతల్లిని దారుణంగా కొట్టి.. ఆమె దగ్గరున్న డబ్బుల సంచిని లాక్కున్నాడు. అనంతరం బైకులోని పెట్రోల్ తీసుకొని.. ఆమె మీద చల్లి నిప్పు పెట్టాడు.
దీంతో ఆమె భయంతో పెద్ద ఎత్తున కేకలు వేయటంతో మైసయ్య ఇంట్లో నుంచి బయటకు వచ్చి.. మంటల్ని ఆపే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో తండ్రిని సైతం బాలమల్లు కర్రతో కొట్టి గాయపరిచారు.
కాలిన గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పోశవ్వ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. లక్ష రూపాయిల డబ్బుకోసం తల్లిదండ్రుల్ని ఇంత దారుణంగా హింసించటమా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. తీవ్రంగా దాడి చేసిన బాలమల్లుపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.