Begin typing your search above and press return to search.
ఉప ఎన్నిక తర్వాతే కొత్త పీసీసీ చీఫ్ అట?
By: Tupaki Desk | 7 Jan 2021 2:22 PM GMTతెలంగాణ పీసీసీ చీఫ్ ఎన్నిక ఎప్పుడు? అనేది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తున్న విషయం.. టీపీసీసీ చీఫ్ అయ్యే నేత కోసం కాంగ్రెస్ శ్రేణులే కాదు.. నాయకులు కూడా కళ్లు కాయలు కాసి.. పండ్లు అయ్యి పుచ్చిపోయేలా ఎదురుచూస్తున్నారు. అయినా కరుణించరేం అని అధిష్టానం వైపు ఆశావహులు, కాంగ్రెస్ నేతలు దీనంగా చూస్తున్నారు.
అయితే చావు కబురును చల్లాగా చెప్పారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్. తాజాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాత టీపీసీసీ చీఫ్ కొత్త నియామకం ఉంటుందని బాంబు పేల్చారు. దీంతో ఆశావహులంతా ఉసూరుమన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ జాప్యం చేస్తోందని బాధపడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు..
ఇటీవల పెద్దలు జానారెడ్డిగారు ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారని వార్తలు వచ్చాయి.. అమ్మా సోనియమ్మా తాను పోటీచేసే ‘నాగార్జున సాగర్ ’లో ఉప ఎన్నిక పూర్తి అయ్యే వరకు కొత్త పీసీసీ చీఫ్ ను నియమించవద్దని.. తాను సొంత క్రెడిట్ తో గెలిస్తే ప్రతిఫలాన్ని వారి ఖాతాలో వేసుకుంటారని ఆయన ఈ లేఖలో కోరారు.
దుబ్బాకలో రఘునందన్ రావు సొంత సానుభూతితో గెలిస్తే ఆ క్రెడిట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన్నుకుపోయాడని.. ఇక్కడ నాగార్జున సాగర్ లో నా బలంతో గెలిస్తే కొత్త పీసీసీ చీఫ్ దాన్ని కబ్జా చేస్తారని జానారెడ్డిగారు లేఖలో రాసినట్టు ప్రచారం సాగింది. అది నిజమో కాదో తెలియదు కానీ.. తాజాగా పార్టీ తెలంగాణ ఇన్ చార్జి మాణిక్కం ప్రకటనతో తేటతెల్లమైంది.
తాజాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాతే తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ నియామకం జరుపుతామని మాణిక్కం ఠాగూర్ తెలిపారు. చాలా మంది నేతలు ఇదే అభిప్రాయం వెల్లడించారని.. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా నేతను ఎన్నుకుంటామన్నారు. అప్పటివరకు ఉత్తమ్ పీసీసీ చీఫ్ అని ప్రకటించారు.
ముందే ప్రకటిస్తే నేతలంతా చీలిపోయి పార్టీ నాశనమై.. నాగార్జున సాగర్ లో గెలుపు కష్టమవుతుందనే అభిప్రాయంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ మెలిక పెట్టిందని కాంగ్రెస్ వాదులు చెవులు కొరుక్కుంటున్నారు.