Begin typing your search above and press return to search.
కొత్త విద్యా మంత్రి మీద ట్రోలింగులే ట్రోలింగులు
By: Tupaki Desk | 12 April 2022 10:30 AM GMTఏపీకి కొత్త విద్యా శాఖ మంత్రి వచ్చారు. ఆయన సామాన్యుడేమీ కాదు, సీనియర్ మోస్ట్ నేత. రాజకీయంగా మూడు దశాబ్దాలకు పైగా ఉన్న వారు. అనేక కీలక పదవులు నిర్వహించిన అనుభవం ఉన్న వారు. అలాంటి బొత్స సత్యనారాయణకు మునిసిపల్ శాఖను తీసేసి విద్యా శాఖను చూడమన్నారు ముఖ్యమంత్రి జగన్. ఈ కొత్త శాఖకు ఆయన పెద్ద మాస్టారు అన్న మాట.
అయితే విభజన ఏపీలో చూస్తే విద్యా శాఖను కూడా చాలా కీలకంగా చూస్తున్నారు. గతంలో ఉన్నత విద్యా శాఖకు ఒక మంత్రి ఉండేవారు. ప్రాధమిక విద్యకు మరో మంత్రిని తీసుకునేవారు. ఇపుడు అన్నీ కలిపేసి ఒకే శాఖ చేశారు. అంటే కేజీ నుంచి పీజీ వరకూ అంతా విద్యా శాఖ మంత్రి చూడాల్సిందే. ఒక వైపు సర్కారీ బడులను తనిఖీ చేస్తూ వాటి బాగోగులు చూస్తూ మరో వైపు విశ్వవిద్యాలయాలు, వాటి వ్యవహారాలు కూడా చక్కబెట్టాలి.
ఇక జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత నాడు నేడు పేరిట భారీ ప్రోగ్రాం తలపెట్టింది. దాంతో పెద్ద ఎత్తున నిధులు వెచ్చింది పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నారు. దాంతో ఈ శాఖ మీద బాధ్యత మరింతగా పెరిగింది. బొత్స వంటి సీనియర్ ఈ శాఖను సులువుగానే నిభాయించగలరు అన్న నమ్మకంతోనే ముఖ్యమంత్రి ఆయనకు ఈ శాఖను చూడమన్నారని అంటున్నారు.
అయితే బొత్స పక్కా మాస్ లీడర్, ఆయన ఇప్పటిదాకా ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న శాఖలనే చూశారు. విద్యా శాఖలో ఆ అవకాశం అయితే కచ్చితంగా ఉండదు, అదే టైమ్ లో ఈ శాఖలో వ్యవహారాలు అన్నీ కూడా పక్కా క్లాస్ గా ఉంటాయి. అలాగే ముందే చెప్పుకున్నట్లుగా బొత్స పెద్ద మాస్టార్ పాత్ర పోషించాలి.
ఒక విధంగా భావితరాలను దిశా నిర్దేశం చేసే కీలకమైన శాఖ. మరి ఈ శాఖకు బొత్స పేరు ప్రకటించగానే సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఒక్క లెక్కన స్టార్ట్ అయిపోయాయి. గతంలో బొత్స ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంగ్లీష్ ఇంటర్వ్యూని కూడా వీడియో క్లిప్పింగ్ పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. అందులో బొత్స అర్ధం కానట్లుగా మాట్లాడారని కామెంట్స్ పెడుతున్నారు.
ఆయన ఏపీకి కొత్త విద్యా శాఖ మంత్రి అని సెటైర్లు వేస్తున్నారు. నిజంగా ఇది ఘాటు విమర్శగా చూడాలి. బొత్స ఇంకా తన శాఖ బాధ్యతలు చేపట్టలేదు. ఆయన ఇంకా పని మొదలెట్టకుండానే ఆయన మీద నెగిటివ్ కామెంట్స్ చేయడం తగునా అన్న మాట అయితే వైసీపీ నుంచి వస్తోంది. మొత్తానికి చూస్తే బొత్స ఏం చెబుతారో ఎవరికీ అర్ధం కాదని, ఆయన విద్యా మంత్రిగా భావి పౌరులకు ఎలా దిశానిర్దేశం చేస్తారు అన్న విమర్శల కోసమే ఈ ట్రోలింగ్స్ అంటున్నారు. మరి దీనిని ఒక సవాల్ గా తీసుకుని బొత్స ఈ శాఖలో తన సత్తా చాటుతారని అంతా ఆశిస్తున్నారు.