Begin typing your search above and press return to search.
హెచ్ 1బీ వీసా .. లాటరీ విధానానికి స్వస్తి .. ట్రంప్ కీలక నిర్ణయం !
By: Tupaki Desk | 29 Oct 2020 3:30 PM GMTఅమెరికాలో ఎన్నికల హిట్ కొనసాగుతుంది. నవంబర్ మూడు న అధ్యక్ష ఎన్నికలకి పోలింగ్ జరగబోతుంది. ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచి అధ్యక్షుడిగా వైట్ హౌస్ లో అడుగుపెట్టాలని దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపధ్యలోనే ట్రంప్ సర్కార్ భారతీయ ఐటి నిపుణులకు మరోసారి షాక్ ఇచ్చింది. హెచ్ 1బీ వీసాల జారీలో కంప్యూటరైజ్డ్ లాటరీ పద్దతికి గుడ్ బై చెప్తూ మరో కీలక ప్రతిపాదన చేసింది. దీని స్థానం లో వేతన స్థాయి ఆధారిత వీసాలు జారీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఫెడరల్ రిజిస్టర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్ పై 30 రోజుల్లోగా స్పందన తెలియజేయవచ్చుని అమెరికన్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ తెలిపింది. ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యత అంటూ ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్న ట్రంప్ సర్కార్ తాజాగా లాటరీ పద్దతిన వీసాలు కేటాయించే పద్దతికి కూడా స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. లాటరీ విధానాన్ని రద్దు చేసి ఇకపై గరిష్ఠ వేతన స్థాయి వీసాల ద్వారా మెరుగైన వేతనాలను అందించేలా ఈ నిబంధన తీసుకొచ్చినట్లు ట్రంప్ సర్కార్ ప్రకటించింది.
ఇండియా తో సహా ఇతర దేశాల నుండి ప్రతీ ఏడాది హెచ్ 1బీ వీసా కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తూ ఉంటాయి. వీటిలో కంప్యూటర్ లాటరీ ద్వారా 65 వేల మందిని ఎంపిక చేసి హెచ్ 1బీ వీసాలు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పద్దతిలో విదేశాలకు చెందిన అభ్యర్ధులు చౌకగా దొరుకుతుండడంతో అమెరికా యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతోందంటూ ట్రంప్ సర్కార్ వాదిస్తోంది. దీనికి బదులుగా ఎక్కువ నైపుణ్యం ఉండి, ఎక్కువ జీతాలకు పని చేసే ఉద్యోగులకు మాత్రమే హెచ్ 1బీ వీసాను జారీచేసేలా చర్యలు చేప్పట్టబోతోంది.