Begin typing your search above and press return to search.
గ్రౌండ్ రియాలిటీ ఇదే : వైసీపీకి సర్వేలు చెబుతున్న సత్యాలు....?
By: Tupaki Desk | 19 July 2022 2:30 AM GMTఅధికారంలో ఉన్న పార్టీకి మరోసారి రావాలని ఉంటుంది. కానీ ప్రజలకు మాత్రం ప్రజాస్వామ్యంలో ఎపుడూ అనేక అవకాశాలు ఉంటాయి. వారు కాకపోతే వీరు అన్న థియరీ ఎపుడూ జనాలు అప్లై చేస్తారు. పూర్వకాలంలో అయితే ఒకే పార్టీ ఒకే నాయకుడు దశాబ్దాల పాటు కొనసాగిన వైనాలు ఉన్నాయి. ఇది సోషల్ మీడియా యుగం. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ వాడిదీ ఒక ప్రపంచమే. ఇలా కోట్లాది ప్రపంచాలను ఏకం చేయడం అంటే ఎవరికీ ఏ కోశానా కుదిరే పని కాదు.
ఇక అయిదేళ్ల పాటు పాలించే పార్టీలకు సహజంగా ప్రజాదరణ తగ్గుతుంది. బ్రహ్మాండం బద్ధలయ్యేలా పాలించేవారు కూడా ఓటమి చూస్తారు. ఏపీలో అయితే విభజన గాయాలతో స్టేట్ ఏర్పడింది. ఆ మీదట అప్పులు తప్పులు అన్నీ అలవాటు అయ్యాయి. గతంలోలా ఈ రోజు ఎందుకు లేదు అని ఉమ్మడి ఏపీతో పోలిక పెట్టుకుని అంతా చూడడం కద్దు. అపుడు అసంతృప్తి మీటర్ దారుణంగా పెరిగిపోవడం తప్ప మిగిలేది ఉండదు.
ఇక రెవిన్యూ లోటు తో పాటు వారసత్వంగా వచ్చిన అప్పుల తిప్పలు, వీటికి తోడు అన్నట్లుగా కేంద్రం సహాయ నిరాకరణ, విభజన హామీలు నెరవేర్చకపోవడం, తాముగా రాజకీయ పార్టీలు చేసుకున్నవి ఇబ్బడిముబ్బడిగా హామీలను ఇచ్చేసి వాటిని తీర్చలేక ఆపసోపాలు పడుతున్న విషయాలు. ఇదంతా టీడీపీ అయిదేళ్ల ఏలుబడిలో అంతా చూశారు.
దానికి మించి ఇపుడు వైసీపీలోనూ అదే సీన్ కనిపిస్తోంది. మధ్యలో రెండేళ్ల కరోనా కష్టకాలం జనాలకు వాస్తవాలను తెలియచేయకపోగా సమస్యలను పెంచింది, ఆర్ధికంగా మరింత దిగువకు చేర్చి కృంగదీసింది. ఇక నాడూ నేడూ కూడా పాలకులు చేస్తున్న తప్పులు ఏమిటి అన్నది చూస్తే ప్రజలు ఏం కోరుకుంటున్నారు తామేని చేస్తున్నామని అన్నది ఆలోచించకపోవడమే.
తమ ప్రాధాన్యతలను వారు ముందు పెట్టుకుని చేసుకుపోతున్నారు. దాంతో జనాలు కూడా వారికి ఎదురు వస్తున్నారు. వ్యతిరేకత నిండా పెరుగుతోంది. టీడీపీ సర్కార్ మీద అయిదేళ్ళ ఏలుబడిలో పెరిగిన వ్యతిరేకత అంతా వైసీపీకి మూడేళ్లలోనే కట్టకట్టుకుని రావడం వెనక స్వీయ తప్పిదాలే ఎక్కువ అని చెప్పాలి. అన్నప్రాశన నాడే ఆవకాయ చందాన అన్ని పధకాలు తొలి ఏడాదే అమలు చేయాలన్న ఆరాటం ఒక వైపు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలిసినా పట్టించుకోకపోవడం, కరోనా కాటుతో ఇంకా దారుణంగా చితికిన పరిస్థితిలు ఇలా చాలానే తప్పులు నాడు చేసినవి ఉన్నాయి.
ఇక ఒకసారి పధకాల పులి మీద స్వారీ మొదలెట్టాక ఇక దిగడం అంటే కుదిరే పని కానే కాదు, దాంతో వాటిని అమలు చేయలేక కోతలు వాతలు పెడుతూ మరో వైపు ఆదాయం సరిపోక భారీ ఎత్తున పన్నులు ధరలు భారాలు పెంచుతూ ఇలా రెండికీ చెడిన తీరున ఆర్ధిక నిర్వహణ చేస్తూ జనాల దృష్టిలో మూడేళ్ళకే వైసీపీ సర్కార్ మీద వ్యతిరేకత బాగా తెచ్చుకున్నారూ అంటే తప్పు ఎక్కడ జరిగిందో సమీక్షించుకోవాలి.
అధికారంలోకి వచ్చి మూడేళ్ళు అయినా రోడ్లను వేయకుండా అవి గుంతలుగా మారి పాతాళాన్ని తాకుతున్నా పట్టించుకోని వైనాన్ని సంక్షేమ పధకాలు ఇస్తున్నామని కదా అవి చూసి ఆగండి అంటే ఎవరు పట్టించుకుంటారు, అలాగే అభివృద్ధి గురించి అడిగినా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు నిధులు అడిగినా అంతా సంక్షేమం కోసమే ఇస్తున్నామని దబాయించినా ఎవరు ఆగుతారు, ఆలోచిస్తారు.
ఇక అవసరమే లేని వ్యవస్థగా ఉన్న వాలంటీర్లను అయిన దానికీ కానిదానికీ తిప్పుతూ అసలైన క్యాడర్ ని పక్కన పెట్టేసి వారికి నీరసం నిండా తెప్పించాక ఇది మన ప్రభుత్వం అనమంటే అంటారా. ఇక ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలలో చేయాల్సింది ఏమీ లేక ఫోటోల కోసం ఫోజులకు కూడా అవకాశం లేక ఎవరి సొంత వ్యాపారాల్లో వారు పడిపోయాక జనాలకు ఎవరు మన ఎమ్మెల్యే అన్న డౌట్ రాకుండా ఉంటుందా.
ఆనక అలా గడప గడపకు మన ప్రభుత్వం అంటూ తాపీగా ఎమ్మెల్యేలు వెళ్ళినా వారు మండుతారు తప్ప ఆనందించి స్వాగతించరుగా. అందుకే వైసీపీ వరసబెట్టి చేయిస్తున్న ప్రతీ సర్వేలోనూ అంతకంతకు ప్రభుత్వం మీద ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత పెరిగిపోతోందే తప్ప తగ్గడంలేదుట. ఇది వైసీపీ అధినాయకత్వానికి తెగ ఆందోళన కలిగిస్తోంది. జనాలకు పధకాలు ఇస్తున్నాం కదా అదే చాలు అని భావిస్తే అభివృద్ధి ఏమీ లేదని ఆఖరుకు రోడ్డు కూడా వేసే పరిస్థితి లేదని ప్రజలలో మండుతున్న మంటను చల్లార్చే ప్రయత్నం తక్షణం చేయకపొతే దారుణమైన ఇబ్బందులు వస్తాయని సర్వేలు గట్టిగానే తేల్చి చెబుతున్నాయట.
ఇక్కడ చిత్రమేంటి అంటే ఎమ్మెల్యేలు ఇపుడు గడప గడపకు తిరుగుతున్నారు కాబట్టి వారికి సీన్ అర్ధమైపోతోంది. సర్వేల ద్వారా పెద్దలకు సత్యాలు తెలుస్తున్నాయి. మరి చూస్తే ఉన్నది చాలా తక్కువ టైమ్. ఈ టైమ్ లో పూర్తిగా చక్కదిద్దుకుని గాడిన పార్టీని పెట్టి ప్రభుత్వానికి మంచి మార్కులు తేవాలీ అంటే కష్టమే. మరి ఈ విషయంలో ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరచుకోవాలని లేకపోతే కొత్తవారిని పెట్టి కధ నడిపిస్తామని పార్టీ పెద్దలు భావించినా ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో అన్నదే చూడాలి మరి.