Begin typing your search above and press return to search.
సెంట్రల్ విస్టా నుండి ప్రధాని నివాసానికి సొరంగ మార్గం ... వివరాలివే !
By: Tupaki Desk | 4 March 2021 8:30 AM GMTకేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంట్ భవనం అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకోబోతుంది. కొత్త పార్లమెంట్, ప్రభుత్వ భవనాల ఆధునికీకరణకు సంబంధించి 2019 సెప్టెంబర్లో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ను కేంద్రం చేపట్టింది. ఈ భవనంలో 900 నుంచి 1,200 మంది పార్లమెంట్ సభ్యులు కూర్చునేందుకు వీలుగా.. త్రిభుజాకారంలో నిర్మించనున్నారు. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం (2022 ఆగస్టు 15) నాటికి దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇదే ప్రాజెక్టులో ఉమ్మడి కేంద్ర సచివాలయాన్ని 2024లోపు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. 2020 డిసెంబర్ 10న పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. రూ. 971 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ను నిర్మాణం చేపట్టనున్నట్టు లోక్సభ్ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనంలో ఉన్న లోక్ సభ, రాజ్యసభల కంటే ఇందులోని సభలు చాలా పెద్దవిగా డిజైన్ చేశారు. ఈ భవనంలో 888 మంది లోక్‌సభ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులకు సరిపడా చోటు ఉండేలా నిర్మాణం చేయనున్నారు. టాటా ప్రాజెక్ట్స్ సంస్థ కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తోంది.
ఇకపోతే ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకువచ్చాయి. కొత్తగా నిర్మించబోయే పార్లమెంట్ భవనం నుంచి ప్రధాని నివాసంతో పాటు ఉపరాష్ట్రపతి నివాసం, ఎంపీ చాంబర్స్ కు సొరంగ మార్గాలను నిర్మిస్తున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం మేరకు.. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వంటి వీవీఐపీలు రోడ్డు మార్గంలో పార్లమెంట్ లో వెళ్లాల్సిన అవసరం లేకుండా సొరంగం మార్గాన్ని తయారుచేస్తున్నారు. రోడ్డుపై ప్రధాని కాన్వాయ్ వెళ్తే భారీగా సెక్యూరిటీ కల్పించాలి. అలాగే ట్రాఫిక్ కి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. ఈ సమస్యలకు సొరంగ మార్గం రూపంలో చెక్ పెట్టనున్నారు.
అయితే , రాష్ట్రపతి ఇంటికి మాత్రం సొరంగ మార్గాన్ని నిర్మించడం లేదు. ఎందుకంటే రాష్ట్రపతి పార్లమెంట్ కు ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తారు. కానీ ప్రధాని, ఉపరాష్ట్రపతి, ఎంపీలు సమావేశాలు జరిగినన్ని రోజులు పార్లమెంట్ కు రావాలి. ఈ క్రమంలోనే ప్రధాని, ఉపరాష్ట్రపతి నివాసంతో పాటు ఎంపీ చాంబర్స్ కు సొరంగం మార్గం ఏర్పాటు చేస్తున్నారు. ఇది సింగిల్ లేన్ రోడ్డు. పెద్ద కార్ల అవసరం లేకుండా గోల్ఫ్ కార్ట్‌లోనే సొరంగ మార్గం గుండా నేతలు పార్లమెంట్ కు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా సౌత్ బ్లాక్ వైపు ప్రధాని నివాసం, ప్రధాన మంత్రి కార్యాలయం నిర్మిస్తున్నారు. నార్త్ బ్లాక్ వైపు ఉపరాష్ట్రపతి నివాసాన్ని నిర్మిస్తున్నారు.