Begin typing your search above and press return to search.

జీహెచ్ ఎంసీలో పోలింగ్ శాతం ఫైనల్ ఇదీ

By:  Tupaki Desk   |   2 Dec 2020 1:15 PM GMT
జీహెచ్ ఎంసీలో పోలింగ్ శాతం ఫైనల్ ఇదీ
X
గ్రేటర్ ఎన్నికల్లో ఆఖరి గంటలో ఎక్కడా హడావుడి లేకుండా, క్యూ లైన్లు కనిపించకుండా పోలింగ్ ఎలా పెరిగిందనేది ఇప్పుడు అందరు అనుకుంటున్నారు. మంగళవారం పోలింగ్‌తో పట్టణ ఓటర్లు బద్దకిస్తులు అనేది తేలిపోయింది. గ్రామవాసులకు తెలిసిన ఓటు విలువ పట్టణాల్లో ఉండే వారికి తెలియదంటూ ఆటా డుకున్నారు. ఇదంతా ఒకవైపు ఉంటే… సాయంత్రం ఆఖరి గంట మాత్రం దాదాపు సగం రోజు ఓట్లను రాబట్టినట్లు ఎన్నికల సంఘం లెక్కలు చెప్పుతున్నాయి. దీంతో అసలేం జరిగిందనే ప్రశ్నలు

మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన పోలింగ్ కేవలం 3.96 శాతమే. 11 గంటల వరకు కూడా అదే పరిస్థితి. ఇంకో నాలుగున్నర శాతం వచ్చారు. అంటే 8.90 శాతం పోలింగ్. ఇక మధ్యాహ్నం ఓటర్లు వస్తారని, తినే తీరిక ఉండదనే ఎదురుచూపుల్లో సిబ్బంది ఉన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన 24 గంటల తర్వాత మంగళవారం ఎన్నికల పోలింగ్ శాతాన్ని తెలంగాణ ఎన్నికల కమిషన్ తాజాగా ప్రకటించింది. 149 డివిజన్లకు గాను 46.68 శాతం పోలింగ్ జరిగిందని తెలిపింది.

అత్యధికంగా కంచన్ బాగ్ లో 70.39 శాతం పోలింగ్ నమోదైందని తెలిపింది. అత్యల్పంగా యూసఫ్ గూడాలో 32.99 పోలింగ్ జరిగిందని వెల్లడించింది. కాగా ఓల్డ్ మలక్ పేట డివిజన్ లో గుర్తుల తారుమారు కారణంగా గురువారం రోజు రీపోలింగ్ జరగనుంది.