Begin typing your search above and press return to search.

బాలీవుడ్ కు, డ్రగ్స్ కు ఎలాంటి లింక్ లేదు: కేంద్రం

By:  Tupaki Desk   |   15 Sep 2020 2:30 PM GMT
బాలీవుడ్ కు, డ్రగ్స్ కు ఎలాంటి లింక్ లేదు: కేంద్రం
X
సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ లో బయటపడుతున్న డ్రగ్స్ దందాపై కేంద్రం తొలిసారిగా స్పందించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది.

బాలీవుడ్ కు-డ్రగ్స్ కు ఎలాంటి లింక్ లేదని.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో తేలినట్టు కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. బాలీవుడ్ డ్రగ్స్ వివాదంపై తొలిసారి స్పందించింది. బాలీవుడ్ కు డ్రగ్స్ లింక్ ఉన్నట్టు ఆధారాలు లభించలేదని కేంద్రం స్పష్టం చేసింది.

దేశమంతా తీవ్రంగా ఈ కేసు గురించి చర్చించుకుంటున్న ఈ సమయంలో కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది.

సుశాంత్ సింగ్ ఆత్మహత్య.. డ్రగ్ కేసుతో సంబంధం ఉన్న రియా చక్రవర్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి కస్టడీకి తరలించారు. అంతకముందే ఈ కేసుతో సంబంధం ఉన్న రియాచక్రవర్తి సోదరుడు షోవిక్, సావంత్, శామ్యూల్ మిరిండా, అబ్బుల్ బాసిత్ లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి విచారణలో అనేక సంచలన విషయాలు బయటికి వచ్చాయి.

రియా చక్రవర్తి డ్రగ్స్ తో సంబంధం ఉన్న బాలీవుడ్లోని 25మంది ప్రముఖుల పేర్లు రియా వెల్లడించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.. ఇప్పటికే ఆమె ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రియా, మిగతా నిందితులు చెప్పిన వివరాలను ప్రకారం పోలీసులు ఇప్పటికే బాలీవుడ్లోని సెలబ్రెటీలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు.

కాగా బాలీవుడ్ కు డ్రగ్స్ సంబంధంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ కేంద్రం కీలక ప్రకటన.. సంబంధం లేదనడం హాట్ టాపిక్ గా మారింది.