Begin typing your search above and press return to search.
నీరు వృధా చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష - రూ. లక్ష జరిమానా!
By: Tupaki Desk | 23 Oct 2020 11:30 PM GMTనీరు .. ఈ సమస్త కోటికి జీవనాధారం. ఆహారం లేకపోయినా కూడా చాలామంది నీటితో బ్రతికేస్తుంటారు. ఈ సృష్టిలో ఏది లేకపోయినా ముందుకు సాగగలం కానీ , నీరు లేకపోతే మాత్రం మనం అడుగు ముందుకు వేయడం చాలా కష్టం. ఒక చుక్క నీరు కూడా ఎదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు ఈ భూమి పై సంవృద్ధిగా నీరు దొరికేది కానీ , కాలం మారేకొద్దీ మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల నీటి శాతం రోజురోజుకి తగ్గిపోతుంది. చెరువుల్లో - బావుల్లో నీళ్లు తాగే స్టేజ్ నుండి నీటిని కొనుక్కొని తాగే దుస్థితి చేరుకున్నాం. చివరికి నీరు లేక - పంట పండించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి కారణం .. ముఖ్యంగా అడవులని నరికివేయడం. అయితే , అవసరాలకి అనుగుణంగా ఆలా చేశాం అంటారు కానీ చెట్లు మాత్రం పెంచరు. ఇక నీటి వినియోగం కూడా పెరిగిపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా కూడా నీటిని వృధా చేస్తుంటారు కొంతమంది.
ఈ నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజల అవసరాలకు ఉపయోగపడే నీటిని దుర్వినియోగం చేసిన వృధా చేసిన కఠిన శిక్షలు విధించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీని ప్రకారం భూగర్భ జలాలను వృధా చేస్తే లక్ష జరిమానా - ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉండగా... రాష్ట్రాలు - కేంద్రపాలిత ప్రాంతాలు - స్థానిక సంస్థలు - జలమండళ్లు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్ జీ టీ ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.