Begin typing your search above and press return to search.

చోరీకి గురైన కళాఖండాల్ని భారత్ కు ఇచ్చిన అమెరికా.. వాటి విలువ ఎంతంటే?

By:  Tupaki Desk   |   30 Oct 2021 4:41 AM GMT
చోరీకి గురైన కళాఖండాల్ని భారత్ కు ఇచ్చిన అమెరికా.. వాటి విలువ ఎంతంటే?
X
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను మిలియన్ డాలర్ల విలువ చేసే వందలాది పురాతన వస్తువుల్ని భారత్ కు తిరిగి ఇచ్చేసింది అమెరికా. భారత్ లోని వివిధ ప్రాంతా ల్లో దొంగలించిన ఈ పురాతన సామాగ్రిని భారత్ కు అందజేయటమే కాదు.. అందుకు కారణమైన నిందితుడికి తగిన శిక్ష పడనుందన్న విషయాన్ని స్పష్టం చేసింది. తాజాగా న్యూయార్క్ లోని ఇండియన్ కాన్సులేట్ లో జరిగిన వేడుక లో ఈ కళాఖండాల్ని భారత్ కు అప్పజెప్పారు.

ఇంత కీ ఈ పురాతన కళాఖండాల్ని చోరీ చేసిందెవరు? అతడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అన్నది చూస్తే.. భారీ చోరీలకు పాల్పడిన వ్యక్తి.. కళాఖండాల్ని సేకరించే డీలర్ సుభాష్ కపూర్ గా చెబుతారు. ప్రస్తుతం భారత్ లోని జై ల్లో ఉన్న ఇతడు ఏకం గా పదివేల కళాఖండాల్ని దొంగలించి అమెరికాకు తరలించినట్లు గా అంచనా వేస్తున్నారు. ఇత గాడి గురించి యూఎస్ డిస్ట్రిక్ అటార్నీ సైరస్ వాన్స్ జూనియర్ మాట్లాడుతూ.. ఇతగాడు చేసిన నేరాల పై పెద్ద ఎత్తున దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

తమ దర్యాప్తులో భాగంగా 2500 కళాఖండాల్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నేరానికి పాల్పడిన అతడికి.. అతడికి సహకరించిన వారికి శిక్ష ఖాయమని స్పష్టం చేస్తున్నారు. కపూర్ గ్యాలరీ నుంచి సేకరించిన యూఎస్ ప్రభుత్వం.. వాటి ని భారత్ కు అప్పజెప్పింది. ఆగ్నేయాసియా లోని వివిధ దేశాల నుంచి దోచుకున్న నిధుల్ని రవాణా చేయటానికి న్యూ యార్కును కేంద్రం గా చేసుకున్నాడు.

అంతే కాదు.. అరుదైన కళాఖండాల్ని గుర్తించేందుకు ప్రపంచ వ్యాప్తం గా పర్యటించిన కపూర్.. వాటి లో ముఖ్య మైన వాటిని గుర్తించి దొంగలించటం.. తన గ్యాలరీ కి తరలించటం చేసేవాడు. పోగొట్టుకున్న కళా ఖండాల్ని తిరిగి ఇచ్చిన అమెరి కా శ్రమ ను గుర్తించి అయినా.. వాటిని మరింత భద్రం గా కాపాడే బాధ్యత ను తీసుకోవాల్సిన అవసరం ఉంది.