Begin typing your search above and press return to search.

అసాంజేను అమెరికాకు అప్పగించేందుకు రంగం సిద్ధం: ఎవరీ అసాంజే

By:  Tupaki Desk   |   18 Jun 2022 3:30 PM GMT
అసాంజేను అమెరికాకు అప్పగించేందుకు రంగం సిద్ధం: ఎవరీ అసాంజే
X
ఎట్టకేలకు జులియన్ అసాంజేను అమెరికా రప్పించుకుంటోంది. కొన్నేళ్లుగా అసాంజే కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఇన్నాళ్లకు ఫలించాయి. అమెరికాకు చెందిన రహస్య సమాచారాన్ని లీక్ చేసిన అసాంజేను అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. అయితే చివరి ప్రయత్నంగా అప్పీల్ చేసుకునేందుకు అసాంజేకు 14 రోజుల గడువు ఇచ్చారు.

ఒకవేళ ఎలాంటి అప్పీల్ లేకపోతే అసాంజేను అమెరికా తీసుకెళ్లనుంది. అమెరికాకు సంబంధించిన సైనిక, దౌత్య సమాచారాన్ని జులియన్ అసాంజే వికీలీక్స్ ద్వారా బయటపెట్టారు. దీంతో ఆయనపై 17 అభియోగాలను ఉన్నాయని, వికీలీగ్ సంస్థపై కంప్యూటర్ దుర్వినియోగం కేసు ఉందని అమెరికా వాదిస్తోంది. ఒకవేళ అమెరికా అసాంజే వస్తే 175 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు.

ఆస్ట్రేలియా దేశానికి చెందిన జులియన్ అసాంజే ఓ సామాజిక కార్యకర్త. ఆస్ట్రేలియా ప్రభుత్వ అప్రజాస్వామిక ఆగడాలను భరించలేక స్వీడెన్ లో స్థిరపడ్డాడు. ఆ తరువాత 2006లో వికీలీక్స్ అనే సంస్థను స్థాపించాడు. 2010లో అమెరికాకు చెందిన రహస్య సమాచారాన్ని బయటపెట్టి సంచలనం రేపాడు.

అమెరికా చేస్తున్న ఆగడాలను, వరుస దస్త్రాలను, దౌత్య సంబంధ తంత్రీ సమాచారాన్ని పెద్ద మొత్తంలో బయటపెట్టాడు. అలాగే మిలటరీ సైన్యం విషయాన్ని బహిర్గతం చేశాడు. దీంతో అమెరికా ప్రభుత్వం అతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఇద్దరు స్వీడెన్ సెక్స్ వర్కర్లతో అసాంజేపై అసమంజన అత్యాచార కేసులు పెట్టించింది. ఇలా మొత్తం 18 కేసులను నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో అసాంజే అమెరికాకు దొరకకుండా 2012 నుంచి లండన్ లోని ఈక్వేడార్ దౌత్య కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్నాడు. అయితే లండన్ లోని మెట్రో పాలిటన్ పోలీసులు 2019 ఏప్రిల్ 11న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి బ్రిటన్ లోనే జైలు జీవితం అనుభవిస్తున్నారు. గతంలోనే అసాంజేను రప్పించేందుకు అమెరికా ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ యూఎస్ జైళ్లో అత్యంత భద్రత కలిగి ఉన్నందున ఆత్మహత్య చేసుకోవచ్చిన ఆయన చేసుకున్న అప్పీల్ కు ఉపశమనం పొందారు. కానీ తాజాగా ఆయన చేసుకున్న అప్పీల్ తిరస్కరణకు గురైంది. అయితే 14 సాధారణ రోజుల గడువు మంజూరు చేసింది.

జులియన్ అసాంజే వికీలీక్స్ తరువాత అమెరికాలో ముగ్గురు అధ్యక్షులు మారారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా అసాంజేపై కనికరించలేదు. ఎందుకంటే అమెరికాకు చెందిన అత్యంత రహస్యాన్ని బయటపెట్టిన అసాంజేను ఎలాగైనా రప్పించాలని చూస్తోంది. దేశంలో వాక్ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, మానవహక్కుల గురించి సమాచారం ప్రపంచానికి తెలియజేయడం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. మానవ హక్కుల హననానికి పాల్పడుతున్న వైనాన్ని బయటపెట్టే ఎవరినైనా జైలులో పెట్టవచ్చని తన సన్నిహిత దేశాలను కోరింది. ఈమేరకు బ్రిటన్ ప్రభుత్వం అసాంజేను అప్పగించేందుకు సహకరిస్తోంది.