Begin typing your search above and press return to search.
మే 7 న ఆకాశంలో అద్భుతం...మిస్ కాకండి !
By: Tupaki Desk | 5 May 2020 5:30 PM GMTమే 7 న బుద్ధపూర్ణిమ. పౌర్ణమి రోజున మాత్రమే ఫుల్ మూన్ దర్శనం ఇస్తుంది. అయితే, ఈ ఏడాది ఆకాశంలో ఓ అద్భుతం జరగబోతున్నట్టు నాసా ధ్రువీకరించింది. మే 7న ఆకాశంలో చందమామ ఉదయించేటప్పుడు , అస్తమించేటప్పుడు ... డీప్ ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది. ఆ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. బుద్ధపూర్ణిమ రోజున వచ్చే చంద్రుడిని ఫుల్ మూన్, బ్లడ్ మూన్ అనే పేరుతో పిలుస్తుంటారు. కానీ, ఈసారి ఆకాశంలో దర్శనం ఇవ్వబోతున్న చంద్రుడికి ఫ్లవర్ మూన్ గా పిలుస్తున్నారు.
ఇది ఈ సంవత్సరం కనిపించే నాలుగో, చివరి సూపర్ మూన్. ఈ ఏడాది ఇప్పటికే మనం మూడు సూపర్‌మూన్ లను చూశాం. ఏప్రిల్‌లో సూపర్ పింక్ మూన్ వచ్చింది. ఇప్పుడు మరోసారి సూపర్ మూన్ రాబోతోంది. భూమికి చందమామ అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని సూపర్ మూన్ అంటారు. దాన్ని ఒక్కో నెలలో ఒక్కో పేరుతో పిలుస్తున్నారు. మే 7న కనిపించే చందమామ రోజూ కంటే... 14 శాతం పెద్దదిగా ఉంటుంది. అలాగే... రోజు కంటే 30 శాతం ఎక్కువ కాంతితో కనిపిస్తుంది.
చంద్రుడు భూమికి మరింత దగ్గరకు వస్తున్నందువలన ఇలా మూడు రోజులపాటు ఫుల్ మూన్ దర్శనం ఇవ్వబోతున్నట్టు నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇంతకీ దీన్ని సూపర్ ఫ్లవర్ మూన్ అని ఎందుకంటున్నారంటే... ఈ సమయంలో... మే నెలలో ఎక్కువగా పూలు పుస్తాయి. అందువల్ల అలా పిలుస్తున్నారు. అమెరికాలో గిరిజనులు... మే నెలలో పూలతో కొన్ని ఆచారాలు పాటించేవారు. అందువల్ల కూడా మేలో వస్తున్న చందమామను సూపర్ ఫ్లవర్ మూన్ గా పిలుస్తారు.