Begin typing your search above and press return to search.

పౌరసత్వ సవరణ బిల్లు పై అమెరికా కమిషన్ ప్రకటన దుర దృష్టకరం ...!

By:  Tupaki Desk   |   11 Dec 2019 5:24 AM GMT
పౌరసత్వ సవరణ బిల్లు పై అమెరికా కమిషన్ ప్రకటన దుర దృష్టకరం ...!
X
సోమవారం లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు పై దాదాపు 12 గంటల పాటు తీవ్ర వాదోపవాదాలు, ఆరోపణలతో సాగిన చర్చ అనంతరం పౌరసత్వ సవరణ బిల్లు ను లోక్‌సభ సోమవారం రాత్రి ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే దీని పై యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం ఒక ప్రకటనలో... లోక్‌సభ లో బిల్లు ఆమోదం పొందడం మమ్మల్ని తీవ్రమైన చిక్కుల్లో పెట్టింది అని , రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందింతే, హోం మంత్రి అమిత్‌షా, ఇతర ప్రధాన నాయకత్వం పై ఆంక్షలు విధించే విషయాన్ని అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తుందని యూసీఐఆర్ఎఫ్ తెలిపింది.

ఈ బిల్లులో మతపరమైన కారణాలు తమకు ఆందోళన కలిగిస్తున్నట్టు తమ అధికార ట్విట్టర్‌లో తెలిపింది. వలసదారులకు పౌరసత్వాన్ని కల్పించే బిల్లులో ముస్లింలను మినహాయించడం ద్వారా మతప్రాతిపకగా పౌరసత్వం కల్పిస్తున్నారనే వాదనకు బలం చేకూర్చుతుంది అని తెలిపింది. అయితే యూఎస్ కమిషన్ ప్రకటన పై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆ ప్రకటన దురదృష్టకరమని భారత్ లిపింది. యుఎస్‌సిఐఆర్‌ఎఫ్ గత రికార్డును చూస్తే దాని ప్రకటన ఆశ్చర్యం కలిగించలేదు. ఏది ఏమయినప్పటికీ, స్పష్టంగా తెలియని విషయం పై దాని పక్షపాతం ద్వారా మాత్రమే మార్గనిర్దేశం చేయటానికి ఈ బాడీని ఎంచుకోవడం విచారకమని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పౌరసత్వ బిల్లు పై యుఎస్‌సిఐఆర్‌ఎఫ్ చేసిన ప్రకటన ఖచ్చితమైనది కాదని తెలిపింది.

ఇకపోతే భారత పౌరసత్వం కోసం మతపరమైన పరీక్ష పాస్ కావాల్సి ఉంటుందని, దానివల్ల లక్షలాది ముస్లింల పౌరసత్వం ప్రమాదంలో పడుతుందని ఈ కమిషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2019 జనవరిలో మొదటిసారి పౌరసత్వ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. కానీ దీనిపై నిరసనలు వెల్లువెత్తడంతో రాజ్యసభలో ఓటింగుకు ముందే ప్రభుత్వం దీనిని వెనక్కు తీసుకుంది. తర్వాత జరిగిన ఎన్నికల లో మళ్లీ మోదీ ప్రభుత్వమే రావడంతో, బిల్లును మళ్లీ లోక్‌సభ లో ప్రవేశపెట్టారు. అక్కడ దానికి ఆమోదం లభించింది.

ఇక పోతే చట్టం చేయడానికి ఈ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందడం తప్పనిసరి. అలాగే ఈ బిల్లు పై లోక్‌సభలో చర్చ సమయంలో బిల్లును చించి పారేసిన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన ట్వీట్‌ లో అర్థరాత్రి మొత్తం ప్రపంచం నిద్ర పోతున్నప్పుడు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం పట్ల భారతదేశ ఆదర్శాలకు ఒకే దెబ్బతో ద్రోహం చేశారు అన్నారు. కాంగ్రెస్ సహా చాలా విపక్షాలు ఈ బిల్లు ను వ్యతిరేకించాయి. ప్రభుత్వం మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతోంది.