Begin typing your search above and press return to search.
భారత్ వెళ్లడం క్షేమం కాదు...అమెరికన్లకు ప్రభుత్వం విజ్ఞప్తి!
By: Tupaki Desk | 8 Aug 2020 1:30 AM GMTకరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత కొన్నిరోజులుగా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. కరోనాను అరికట్టడానికి మరో మార్గం లేకపోవడంతో రవాణాను పూర్తిగా రద్దు చేశారు. కరోనా కారణంగా విదేశీ ప్రయాణాలపై విధించిన ఆంక్షలను తాజాగా అమెరికా ప్రభుత్వం తొలగించింది. 4 నెలల తరువాత అమెరికా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే , ట్రావెల్ అడ్వైజరీలో 50 దేశాల స్టేటస్ లో ఇప్పటికీ ఎలాంటి మార్పులు చేయలేదు. దీన్ని ఆ దేశాలకి వెళ్లడం క్షేమం కాదు అని తెలియజేస్తుంది. అందులో భారత్ కూడా ఉండటం గమనార్హం. అయితే , ప్రస్తుతంలో ఇండియా లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసుల్ని పరిశీలిస్తే .. ఏ దేశం అయినా కూడా తమ దేశ పౌరులకి ఈ విధమైన సలహాలే ఇస్తుంది.
కరోనా విజృంభిస్తున్న సమయంలో మార్చి 19న అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ లెవల్ 4-డు నాట్ ట్రావెల్ అడ్వైజరీ పేరుతో అత్యున్నత స్థాయి ప్రకటన విడుదల చేసింది. కరోనా కారణంగా అమెరికన్లు విదేశీ ప్రయాణాలు చేయవద్దని తెలిపింది. తాజాగా విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ.. 50 దేశాల విషయంలో ఇంకా ఆ విధానాన్నే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భారత్ కూడా ఓ దేశం. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ కు అమెరికన్లు వెళ్లడం క్షేమకరం కాదని అమెరికా విజ్ఞప్తి చేసినట్టే ..అత్యవసరం అయితే తప్ప ఇండియా కి వెళ్లడం కోరి కష్టాల్లో పడ్డట్టే అని తెలిపింది.
అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ అగస్టు 6 న విడుదల చేసిన ట్రావెల్ అడ్వైజరీలో... 'కరోనా కారణంగా భారత్ వెళ్లడం మంచిది కాదు. క్రైమ్,ఉగ్రవాదం కారణంగా భారత్ లో మరిన్ని చర్యలు చేపడుతున్నారు.' అని తెలిపింది. మరోవైపు సీడీసీ..కరోనా తీవ్రతలో భారత్ కు లెవల్ 3 జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ పర్యటనకి వెళ్తే ఏ క్షణంలో ఏ నియమాన్ని అమలు చేస్తారో అని వెల్లడించింది. గ్లోబల్ కోవిడ్ 19 పాండెమిక్ నోటీస్ పేరుతో సీడీసీ గతంలో లెవల్ 3 ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. అయితే , భారత్ మాత్రం ఇంకా లెవెల్ 4 లోనే ఉంది. అయితే , నియమాలు అమెరికా ఎత్తేసినప్పటికీ ఏ దేశం పడితే ఆ దేశానికీ వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. ఎందకు అంటే .. అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా నుండి వచ్చేవారిపై వారి దేశంలో ఆంక్షలు ఉండే అవకాశం ఉంది. జాన్ హోప్కిన్స్ సెంటర్ లెక్కల ప్రకారం ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 19 మిలియన్ల మంది కరోనా బారినపడ్డారు. 7,13,000 మంది కరోనాతో మృతి చెందారు. ఇందులో ఒక్క అమెరికాలోనే 4.8మిలియన్ల కరోనా కేసులున్నాయి. మొత్తంగా చూస్తే అమెరికా ఒక్క ముక్కలో భారత్ వెళ్లడం ..ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టే అని తమ దేశ పౌరులకు తెలిపింది. ఒక మూడు నెలల క్రితం పరిస్థితి దీనికి రివర్స్ ఉండేది. అప్పుడు ఇండియా నుండి అమెరికాకి వెళ్లడం అంత క్షేమం కాదు అని భావించేవారు కానీ , కొద్దిరోజులకే అంతా తారుమారు అయింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇండియా లో కరోనా ఎంతగా వ్యాప్తి చెందుతుందో .