Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ మిక్స్ చేసి వేసేస్తున్నారు.. ఏమీ కాదా?
By: Tupaki Desk | 6 Jun 2021 11:30 AM GMTకరోనా మహమ్మారికి ఇప్పటి వరకు మందు లేదు. ముందస్తుగా అడ్డుకునేందుకు వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో.. అన్ని దేశాలూ వ్యాక్సిన్ జపం చేస్తున్నాయి. ఎవరికి వారు వ్యాక్సిన్లు తయారు చేసుకొని ప్రజలకు వేస్తున్నారు. అయితే.. దేని ప్రభావం ఎంత? అనేదానిపై సందేహాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఏ వ్యాక్సిన్ కూడా వంద శాతం కరోనాను నిరోధిస్తుందనేది తేలలేదు. 80 శాతం 90 శాతం అంటూ లెక్కలు మాత్రమే చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో చాలా మందికి వచ్చిన ఆలోచన టీకా మిక్సింగ్. అంటే.. మొదటి డోసులో ఒక కంపెనీ వ్యాక్సిన్, రెండో డోసులో మరో కంపెనీ వ్యాక్సిన్ తీసుకోవడం. ఈ వ్యాక్సిన్ కాక్ టెయిల్ వేస్తే ఎలా ఉంటుంది? కరోనాపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే చర్చ ఎప్పుడో మొదలైంది. ఇదే విషయమై పలు దేశాల్లో పరిశోధనలు సాగుతుండగా.. కొన్ని దేశాలు కంప్లీట్ చేసి, మిక్సింగ్ టీకాను వేసేస్తున్నాయి కూడా!
ఈ జాబితాలో జర్మనీ, స్పెయిన్, స్వీడన్, ఫ్రాన్స్, డెన్మార్క్, నార్వే వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు.. మిక్సింగ్ టీకా తీసుకోవాలని తమ దేశ పౌరులకు సూచిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల కరోనాపై వ్యాక్సిన్ పోరు మరింత బలంగా సాగుతుందని సూచిస్తున్నాయి. అయితే.. ఇలాంటి ప్రయోగాల వల్ల లాభంతోపాటు నష్టం కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఈ ఆందోళన చాలా దేశాల్లో ఉంది.
అయితే.. టీకా మిక్సింగ్ వల్ల జ్వరం, బాడీ పెయిన్స్ వంటివి కాస్త ఎక్కువగా ఉంటున్నాయని, అంతకు మించిన సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ లేవని ఈ దేశాలు చెబుతున్నాయి. అందుకే.. వ్యాక్సిన్ కాక్ టెయిల్ ను రికమండ్ చేస్తున్నటు పేర్కొంటున్నాయి. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందని అంటున్నాయి.