Begin typing your search above and press return to search.

అమెరికాకు వచ్చే విద్యార్థులకు వ్యాక్సిన్ తప్పనిసరి కాదు .. కానీ,?

By:  Tupaki Desk   |   12 Jun 2021 4:19 AM GMT
అమెరికాకు వచ్చే విద్యార్థులకు వ్యాక్సిన్ తప్పనిసరి కాదు .. కానీ,?
X
కరోనా మహమ్మారి అందరిని కలవరపాటుకి గురిచేస్తుంది. ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి స్టూడెంట్స్ కి విదేశాలకి వెళ్లి పై చదువులు చదవాలని అనుకునే వారికి శాపంగా మారుతోంది. ముఖ్యంగా ఇండియా నుండి ప్రతి ఏడాది అమెరికా కి చదువు కోసం చాలా ఎక్కువమంది వెళ్తుంటారు. కానీ, అలాంటివారికి కరోనా కారణంగా వీసా విషయంలో కొన్ని సమస్యలు ఎదురౌతున్నాయి. టీకా తీసుకుంటేనే అమెరికా లోకి ఎంట్రీ ఉంటుందంటూ గత కొన్ని రోజుల ముందు ఓ వార్త వైరల్ అయింది. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. వ్యాక్సినేషన్‌ విషయంలో తమ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని, జూన్‌ 14 నుంచి యూఎస్‌ వీసా అపాయింట్‌ మెంట్లు యథాతథంగా ఉంటాయని మినిస్టర్‌ కౌన్సెలర్‌ ఫర్‌ కాన్సులర్‌ ఎఫైర్స్‌ డాన్‌ హెప్లిన్‌ స్పష్టం చేశారు.

అమెరికాకి రావడానికి వ్యాక్సినేషన్‌ అసలు అర్హత కాదని, కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో అమెరికాలో అడ్మిషన్లు పొందిన విద్యార్థుల కోసం అమెరికన్‌ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. అదే సమయంలో అమెరికాకు రావాలనుకున్న పర్యాటకులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పట్లో అనుమతి లేదని, అలాంటి వారు వీసాకు దరఖాస్తు చేసుకోకపోవడమే ఉత్తమమని కాన్సులేట్‌ వర్గాలు సూచించాయి. కరోనా తీవ్రత కారణంగా ఇటీవల కొంతకాలంపాటు అమెరికా వీసాల జారీ నిలిపివేశారు. ప్రస్తుతం పరిస్థితులు కుదుట పడుతున్న వేళ నిబంధనలను సడలించి అడ్మిషన్లు పొందిన విద్యార్థులంతా తిరిగి వీసాలకు
https://www.ustraveldocs.com/in
వెబ్‌ సైట్‌ లో దరఖాస్తు చేసుకోవాలని ఢిల్లీలోని యూఎస్‌ ఎంబసీ తెలిపింది. టీకాకు సంబంధించి అమెరికా ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని, ప్రయాణానికి మూడురోజుల ముందు కరోనా నిర్ధారణ పరీక్షలో నెగిటివ్‌ రిపోర్ట్‌ తప్పనిసరి అని ఎంబసీ తెలిపింది. వ్యాక్సినేషన్‌ కోసం సంబంధిత యూనివర్సిటీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ఇండియన్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ.. స్థానిక టీకా తప్పనిసరిగా వేసుకోవాలని సూచించిన వర్సిటీలోనే వేయించుకుంటే ఉత్తమమని అభిప్రాయపడింది. భారత్‌లో అమెరికా వీసాలకు చాలాడిమాండ్‌ నేపథ్యంలో అపాయింట్‌మెంట్‌ కోసం భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నందున జూన్‌ 14న వెబ్‌సైట్‌ క్రాష్‌ అయ్యే ప్రమాదం ఉందని కాన్సులేట్‌ వర్గాలు తెలిపాయి. అందుకే, వీసా దరఖాస్తుల సంఖ్యను బట్టి స్థానిక కాన్సులేట్లు నిర్ణయం తీసుకుంటాయని వివరించాయి.