Begin typing your search above and press return to search.
ఆ దేశంలో ఆ టీకాను ఆపేశారు.. కారణం ఇదే
By: Tupaki Desk | 13 Jun 2021 9:04 AM GMTప్రపంచాన్ని మహమ్మారి కమ్మేసిన వేళలో.. పలు దేశాలు కరోనాకు చెక్ పెట్టే టీకా పరిశోధనలు చేపట్టాయి. దాదాపుగా 120కు పైగా టీకా పరిశోధనలు ప్రపంచ వ్యాప్తంగా సాగాయి. అందులో అందరూ ఆశలు పెట్టుకున్న టీకాలు పదికి మించి లేవు. ఆ టాప్ టెన్ జాబితాలోని ఆక్సఫర్డ్-ఆస్ట్రాజెనెకా వారు తయారు చేసిన టీకా మీద చాలానే అంచనాలు ఉన్నాయి. అయితే.. ఈ టీకాను మార్కెట్లోకి తెచ్చిన తర్వాత వరుస పెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
ఈ టీకాను వినియోగించిన వారు రక్తం గడ్డ కట్టి మరణిస్తున్నారు. దీంతో.. ఈ టీకాను పలు దేశాలు ఇప్పటికే వాడకుండా నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి చేరింది ఇటలీ. రెండు వారాల క్రితం ఇటలీలోని 18 ఏల్ల కెమిల్లా అనే వ్యక్తి ఈ టీకాను తీసుకున్న తర్వాత రక్తం గడ్డ కట్టటంతో మరణించాడు. అయితే.. ఇతడి మరణానికి కారణం అత్యంత అరుదుగా సంభవించే ఆరోగ్య సమస్యగా చెబుతున్నారు.
దీనిపై ఉన్న సందేహాల నేపథ్యంలో.. ఈ టీకాను నిలిపివేస్తూ ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ టీకాను కేవలం 60 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. మరి.. ఇప్పటికే ఈ టీకా మొదటి డోసు తీసుకున్న వారి పరిస్థితి ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. వేరే వ్యాక్సిన్ ఇచ్చే అంశంపై చర్చలు సాగుతున్నాయి. అనేక యూరోపియన్ యూనియన్ దేశాలు ఇప్పటికే ఆక్సఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకాను నిషేధించటం తెలిసిందే. తాజాగా ఇటలీ కూడా ఆ జాబితాలో చేరినట్లైంది.