Begin typing your search above and press return to search.
మీకు తెలుసా.. ఆ ఖర్బూజా కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..!
By: Tupaki Desk | 5 Nov 2021 11:30 AM GMTనేడు పెరిగిపోతున్న సాంకేతికతతో ప్రపంచంలో ఉండే వింతలన్నీ సోషల్ మీడియాలో ఇప్పుడు దర్శనం ఇస్తున్నాయి. ఇంటర్నెట్ మారు మూల ప్రాంతాలకు కూడా చేరడంతో వైరల్ న్యూస్లు క్షణాల్లో షేర్ అవుతున్నాయి. కొన్ని వార్తలు రెగ్యూలర్ అయ్యాయి కానీ.. కొన్నింటిని వింటే మాత్రం అప్పుడెప్పుడో ప్రముఖ వ్యాఖ్యాత సుమ చేసిన ప్రోగ్రాంలాగా అవాక్కయ్యారా! అని అనక తప్పదు. ఇంతకీ అదేంటి అంటే.. ఖర్బూజా కాయ ధర. అందులో వింత ఏముంది? అనుకుంటున్నారా...! అంటే ఖర్బూజా కాయ ధర వంద రూపాయలో... లేక వెయ్యి రూపాయలు ఉంటే సరే, కానీ లక్షల్లో ఉందంటే మామూలు విషయమా..! అలాంటిది ఈ ఖర్బూజా ధర.
ఈ ఖర్బూజా కాయ కిలో ధర సుమారు 20 లక్షలకు పైగా ఉంది. అందులో ఉండే స్పెషల్ ఏంటి? ఎక్కడ సాగవుతుంది? దీనికి ఎందుకు ఇంత ధర అనుకుంటున్నారా..! అయితే ఆ వివరాలు మీకోసం. మనం మార్కెట్కు వెళ్లినప్పుడు అక్కడ రకరకాల పండ్లు, కూరగాయలు,ఇతర పువ్వులు చాలానే ఉంటాయి. పండ్ల విషయానికి వస్తే.. ఆపిల్, అరటి, ద్రాక్ష, ఖర్బూజా పండ్లు కూడా ఉంటాయి. ఇవి శరీరంలోని వేడిని తగ్గించి.. నీటి కంటెంట్ను బాగా పెంచుతాయి. అందుకే ఎక్కువ మంది దీని లోపల ఉండే విత్తనాలను పక్కకు తీసేసి జ్యాస్గా చేసుకొని తాగుతారు. దీని వల్ల ఆరోగ్యానికి చాలామంచిదని వైద్యులు కూడా సూచిస్తారు. ఇలాంటి ఈ పండును కొనాలంటే ఎక్కువలో ఎక్కువగా వంద నుంచి రెండు వందల రూపాయిల మధ్యన ఉంటుంది. అందుకే దీనిని బయట జ్యూస్ షాపుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు కానీ ఇంట్లో కొంచెం తక్కువనే చెప్పాలి. ఇలా వందల్లో ఉండే ఈ ఖర్బూజా పండు కిలో 20 లక్షలకు అమ్ముడవుతుందంట ఓ ప్రాంతంలో. ఇందులో నివ్వెరపోయే నిజం ఏమిటంటే.. దీనికి మంచి డిమాండ్ ఉందంట. చాలా మంది ఈ పండ్ల కోసం ప్రత్యేకంగా ఆర్డర్లు ఇచ్చి కొంటున్నారని చెబుతున్నారు ఆ పండ్లు సాగు చేసే రైతు. అంత ధర పెట్టలేని వారి కోసం అక్కడి రైతులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మరీ అమ్ముతున్నారు. సమయాన్ని బట్టి వీటికి ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు.
ఈ స్థాయిలో అమ్ముడవుతున్న ఖర్బూజా.. ఎక్కడ కాస్తుందనే సందేశం మీకు రావచ్చు. ఇది జపాన్లోని హకైడో దీవిలో సాగవుతుంది. ఇది ఒక హైబ్రీడ్ రకం ఖర్బూజా. దీని పేరు యూబారీ కింగ్. ఈ రకం మిగతా ప్రాంతాల్లో దొరకడం కష్టం అని అక్కడి రైతులు చెప్తున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది పంట ఎక్కువగా పండిందని చెప్పారు. ఈ పండు ఉండే ఆకారం, దీనికి రుచి వల్ల భారీ మొత్తం పెట్టి మరీ కొనుగోలు చేస్తున్నట్లు వినియోగదారులు చెప్తున్నారు. చాలా మంది ఈ పండ్లను తమకు ఎంతో ఇష్టమైన వారి కోసం కోనుగోలు చేస్తున్నట్లు స్థానికంగా వీటిని విక్రయించే వారు చెప్తున్నారు. ఏటా వీటిని కోనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ ఖర్బూజా పండు చిన్నపిల్లలకు ఎంతో మంచిది. ఈ విషయాన్ని తెలుసుకున్న జపాన్లోని ఓ బేవరేజ్ సంస్థ ఈ పండ్లను పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా ఇస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా చిన్నారుల పేర్లను కాగితాలపై రాసి.. డ్రా తీస్తుంది. అందులో వచ్చిన వారికి ఖర్బూజా పండ్లను ఉచితంగా అందిస్తుంది. అయితే ఈ డ్రా కేవలం పేదల కోసం మాత్రమే తీస్తున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు.
పండ్ల ధర ఈ స్థాయిలో ఉంది అని వినడం చాలా మందికి ఇదే మొదటిసారి. అందుకే సోషల్ మీడియాలో ఈ పండు ధర వైరల్ గా మారింది.