Begin typing your search above and press return to search.

గంగా నది నీళ్లు కరోనాను చంపేస్తున్నాయట.. సైంటిస్టుల స్పందన ఏంటంటే!

By:  Tupaki Desk   |   8 July 2021 10:30 AM GMT
గంగా నది నీళ్లు కరోనాను చంపేస్తున్నాయట..  సైంటిస్టుల స్పందన ఏంటంటే!
X
ప్ర‌స్తుతం మ‌న దేశంలో కరోనా వైర‌స్ విల‌య తాండ‌వం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే సెకండ్‌ వేవ్ వ‌చ్చి ప్ర‌ల‌యం సృష్టించిన త‌ర్వాత ఇప్పుడిప్పుడే కాస్త త‌గ్గుతోంది. అయితే ఈ సెకండ్ వేవ్‌లోనే దేశ‌వ్యాప్తంగా చాలా మంది మరణించారు. ఈ మ‌ర‌ణాలు సంభ‌వించిన నేప‌థ్యంలోనే యూపీతో పాటు బీహార్ రాష్ట్రాల్లో ప్ర‌వ‌హిస్తున్న గంగానదిలో చాలామంది శ‌వాలు కొట్టుకువచ్చాయి. అలాగే గంగానది ఒడ్డున కూడా ఎంతోమందిని పాతిపెట్ట‌డంతో అవ‌న్నీ న‌దిలో కొట్టుకు వ‌చ్చాయి.

దాంతో అవ‌న్నీ నిజంగానే క‌రోనా మృత‌దేహాలే అని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ కార‌ణాల‌తో అస‌లు గంగా నదిలో కరోనా వైర‌స్ ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు కేంద్రం ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయింది. దీంతో వెంట‌నే ఉత్తరప్రదేశ్‌, బీహా‌ర్‌ రాష్ట్రాల్లో సిబ్బందిని మోహ‌రించి పెద్ద ఎత్తున అధ్యయనం కూడా చేపట్టిన విష‌యం తెలిసిందే. ఇక ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా స‌ర్వేలో భాగంగా అనేక సంచ‌ల‌న విషయాలు న‌మోద‌య్యాయి.

ఇందులో స‌ర్వేలు చేసిన సిబ్బంది అస‌లు గంగానది నీటిలో కరోనా వైరస్ జాడ ఎక్క‌డా కూడా లేదని, బాగానే ఉన్నాయ‌ని తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల్లోని కన్నూజ్, ఉన్నావో, కాన్పూర్ తోపాటు హమీర్‌పూర్, అలహాబాద్, వారణాసి లాంటి కీల‌క ఏరియాల్లో గంగా నీల్ల‌ను ప‌రిశీలించారు. అలాగే గంగాన‌ది ప్ర‌శ‌హించే బాలియా, బక్సర్ తో పాటు ఘాజీపూర్ లాంటి కీల‌క ప్రాంతాల్లో నీటి నమూనాలను సేక‌రించి పరిశీలించారు ఆ సిబ్బంది. దాదాపుగా దీన్ని రెండు దశల్లో చేపట్టి అస‌లు గంగానది నీళ్ల‌లో కరోనావైరస్ జాడ‌నేది కాన‌రాలేద‌ని తెలిపింది.

గంగాన‌ది నీటి నమూనాల నుంచి వైరస్ ఆర్ఎన్ఏను తీసుకుని వైరాలాజికల్ టెస్టులు చేసినా ఎక్క‌డా వైర‌స్ ఆన‌వాళ్లు క‌నిపించ‌లేద‌ని తెలిపారు సైంటిస్టులు. కాగా ఈ స‌ర్వేను కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ కీల‌కంగా ప‌నిచేసింది. ఇందులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ అలాగే లక్నో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సంస్థ‌లు కూడా కీల‌కంగా ప‌నిచేశాయ‌ని అధికారులు తెలిపారు. ఈ సంస్థ‌లు అన్నీ కూడా జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే అధ్య‌య‌నాలు నిర్వ‌హించి ఈ రిపోర్టును ఇచ్చాయి.

కరోనా శ‌వాల‌ను చాలామంది గంగా నదిలో పడేసిన‌ప్ప‌టికీ కూడా ఆ నీటిలో వైరస్ క‌నిపించ‌లేద‌ని సైంటిస్టులు త‌మ అధ్య‌య‌నాల్లో చాలా క్లియ‌ర్‌గా తెలిపారు. ఈ అధ్య‌య‌నాల‌తో ఉత్త‌ర భార‌త‌దేశం ఊప‌రి పీల్చుకుంది. ఎందుకంటే గంగాన‌దిలో వైర‌స్ ఉంద‌ని చాలామంది ఆ నీటిని తాగేందుకు కూడా ఇంట్రెస్ట్ చూప‌ట్లేదు. ఈ అధ్య‌య‌నాలు అలాంటి అనుమానాలకు చెక్ పెట్టేశాయి.