Begin typing your search above and press return to search.
92 మంది సంపద.. 55 కోట్ల మందితో సమానం అంట!!
By: Tupaki Desk | 2 Aug 2022 4:08 PM GMTకొన్నికొన్ని విషయాలు.. వినేందుకు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. విస్మయాన్ని కూడా కలిగిస్తాయి. ఇప్పుడు ఇలాంటి విషయం పార్లమెంటు సాక్షిగా స్పష్టమైంది. దేశంలో కొన్నేళ్లుగా పేదలు-ధనికుల మధ్య అంతరం పెరుగుతోందనే వాదన ఉంది. ముఖ్యంగా గడిచిన 8 ఏళ్లలో.. ముఖ్యంగా మోడీ పాలనలో.. ఈ తేడా(అంతరం) మరింత పెరుగుతోందని.. ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సంపద మొత్తం ..కొంత మంది దగ్గరే పోగుపడుతోందని.. దీనివల్ల పేదలు మరింత పేదలుగా మారుతున్నారని వారు పదే పదే చెబుతున్నారు. దేశంలో ఉన్న 132 కోట్ల జనాభాలో 55 కోట్ల మంది దగ్గర ఉన్న సంపద.. 92 మంది ధనికుల వద్ద ఉన్న సంపదతో సమానమనే సంచనల విషయం వెలుగు చూసింది.
తాజాగా ఇదే విషయం పార్లమెంటులోనూ ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా విపక్షాలు లేవనెత్తిన కొన్ని అంశాలు.. గణాంకాల సయితంగా.. వారు వెల్లడించిన విషయాలు.. అత్యంత ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తున్నాయి. దేశంలోని 92 మంది అత్యంత ధనికుల సంపద 55 కోట్ల మంది సంపదతో సమానంగా ఉందని.. ప్రతిపక్ష సభ్యులు చెప్పుకొచ్చారు.
ప్రధానంగా నరేంద్ర మోడీ పాలనలో.. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఉపాధి, పొదుపు, పెట్టుబడులు, ఉత్పత్తి, వినియోగం అనే ఐదు మూల స్తంభాలు ఊడిపోయాయని.. కాంగ్రెస్ సభ్యుడు మనీశ్ తివారీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.
దేశంలో పేదల ఆదాయం రోజురోజుకూ తగ్గిపోతోందనేది ఆర్థిక నిపుణులు సైతం హెచ్చరిస్తున్న విషయం. బిలియనీర్ల సంఖ్య మాత్రం వంద నుంచి 142కు పెరిగింది. దేశ సంపదలో 77శాతం.. ఒక శాతం జనాభా చేతిలో ఉంది. దేశంలోని 92 మంది అత్యంత ధనికుల సంపద 55 కోట్ల మంది సంపదతో సమానంగా ఉందని విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. 2016లో పెద్దనోట్లు రద్దుతోనే దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం మొదలైందనేది కూడా అప్పట్లోనే తీవ్ర ఆందోళనకు గురి చేసింది. తర్వా త జీఎస్టీ అమలుతో 2.30 లక్షల చిన్న పరిశ్రమలు దె బ్బతిన్నాయి.
అభివృద్ధి చెందిన దేశం ఎప్పుడు?
దేశంలో ప్రస్తుతం 40 కోట్లమందికి మాత్రమే ఉద్యోగాలున్నాయి. అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే 84 కోట్ల మందికి ఉద్యోగాలు ఉండాలి. అయితే.. ఇంత మందిని ఉద్యోగులు మార్చే మంత్రం కానీ.. వ్యూహం కానీ ప్రభుత్వం వద్ద లేక పోవడం గమనార్హం. పిండి, పెరుగు, పన్నీరు, పెన్సిళ్లపై కూడా జీఎస్టీ పెంచేశారు. శ్మశాన వాటికలపైనా 18 శాతం జీఎస్టీ విధించారు. ఇంధనం నుంచే పన్ను, ఎక్సైజ్ డ్యూటీ, డివిడెండ్ల రూపంలో రూ.27 లక్షల కోట్లు ప్రభుత్వం వసూలు చేసింది. 25 కోట్ల కుటుంబాలను నాశనం చేశారు. ప్రతి గృహిణీ కళ్లలోనూ కన్నీరే అనేది విపక్షాలు చెబుతున్న మాట.