Begin typing your search above and press return to search.
కరోనా టైంలోనూ కుమ్మేశారుగా! పెరిగిన కుబేరుల ఆస్తులు
By: Tupaki Desk | 5 Oct 2020 1:30 AM GMTప్రస్తుతం కరోనా వచ్చి ప్రపంచం మొత్తం కుదేలైంది. ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లోనూ ప్రపంచంలోని శ్రీమంతుల ఆస్తులు కొంచెం కూడా తగ్గలేదు. పైగా యథావిధిగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగింది. ఎన్నో దేశాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. కోట్లమంది ఉపాధి కోల్పోయారు. కానీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు మాత్రం తమ ఆస్తులను మరింత పెంచుకున్నారు. కరోనా విపత్తులోనూ వాళ్ల ఆస్తులు విపరీతంగా పెరిగాయి. ఇండియాలో అపర కుబేరుడు.. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎప్పుడూ టాప్ 10లో ఉండే ముఖేశ్ అంబానీ ప్రస్తుతం తన స్థానాన్ని పదిలంగా నిలబెట్టుకున్నాడు.
2020 సంవత్సరానికి ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హరున్ ఇండియా విడుదల చేసిన జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ టాప్ వన్ లో ఉన్నారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.6,58,400 కోట్లు. అయితే ప్రస్తుత కరోనా విపత్తులోనూ ఆయన ఆస్తి భారీగా పెరిగింది. ఈ ఏడాది ఆయన ఆస్తి 73 శాతం పెరిగిందట. ముఖేశ్ అంబానీ సంపద ప్రస్తుతం గంటకు 90 కోట్లు. కరోనా విపత్తులో ఆయన రూ.2,77,700 కోట్లు వెనకేసుకున్నారు. ఆసియాలో అత్యంత ధనవంతుడిగా ఉన్న ముఖేశ్.. ప్రపంచ కోటీశ్వరుల్లో 4వ స్థానంలో నిలిచారు.
భారత్‌లో రెండో కుబేరులైన హిందూజా సోదరులు మొత్తం ఆస్తి విలువ రూ.1,43,700 కోట్లు. వీరు ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. కరోనా విపత్తు వీరికి మాత్రం కొంచెం నష్టం కలిగించిందని చెప్పవచ్చు. వీరి ఆస్తుల విలువ 23 శాతానికి పడిపోయిందట. హిందూజా సోదరులకు చెందిన ఇండస్ ఇండ్ బ్యాంక్, గల్ఫ్ ఆయిల్, జీవోసీఎల్ కంపెనీల పనితీరు మందగించింది. ఈ మూడు కంపెనీల షేర్ల విలువ దారుణంగా పడిపోయింది. ముంబై, లండన్, జెనీవాలో వీరు తమ వ్యాపార సామ్రాజాన్ని విస్తరించారు.
మనదేశంలో టాప్ 3 కుబేరుడిగా కొనసాగుతున్న హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ నాడర్ ఆస్తి విలువ రూ.1,41,700 కోట్లు, హెచ్‌సీఎల్ వాటాల విలువ 37 శాతం పెరగడంతో ఐదు నుంచి మూడో స్థానానికి చేరుకున్నారు . గత జులైలో హెచ్‌సీఎల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారాయన. ప్రస్తుతం ఆయన కుమార్తె రోషినీ నాడర్ మల్హోత్రా... హెచ్‌సీఎల్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.
గౌతమ్ అదానీ కుటుంబం ఈ సారి కూడా తన పట్టును నిలుపుకుంది. అదానీ కుటుంబం భారతీయ కుబేరుల జాబితాలో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. కరోనా విపత్తులో ఆయన ఆస్తుల విలువ 48 శాతం పెరిగినట్టు సమాచారం. అదానీల ఆస్తి విలువ రూ.1,40,200 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోల్చితే అదానీ సంపద 48 శాతం పెరిగింది. రూ.1,14,400 కోట్ల ఆస్తులతో అజిమ్ ప్రేమ్ జీ ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు. కరోనా కట్టడి కోసం వ్యాక్సిన్ తయారు చేసేందుకు అజీజ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఎక్కువగా వినిపించిన పేరు సిరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. ప్రస్తుతం ఈ సంస్థ చైర్మన్ సైరస్ పూనావాలా భారతీయ కుబేరుల జాబితాలో ఆరో స్థానాన్ని దక్కించుకున్నారు.
ఈ సంస్థ కరోనా వ్యాక్సిన్ల తయారీకి తీవ్రంగా శ్రమిస్తోంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో పాటు పలు కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. సైరస్ పూనావాలా సంపద విలువ రూ.94,300 కోట్లు.. గత జూన్‌లో ఆయన ఆస్తి విలువ 6 శాతం పెరిగింది.
డీమార్ట్ పేరుతో వ్యాపారం చేస్తున్న అవెన్యూ సూపర్ మార్కెట్స్ అధినేత రాధాకృష్ణ దమానీ కుటుంబం ఏడో స్థానంలో ఉంది. దమానీ సంపద విలువ రూ. 87,200 కోట్లు.. 2017లో ఐపీవోకు వెళ్లినప్పటి నుంచి అవెన్యూ సూపర్ మార్కెట్స్ షేర్ విలువ 250 శాతం పెరిగింది. తొలిసారిగా దమానీ ఫ్యామిలీ టాప్‌టెన్‌లోకి అడుగుపెట్టింది.
మిగతా కుబేరులతో పోల్చుకుంటే ఉదయ్ కోటక్ ఆదాయం పెద్దగా పెరగలేదు. ఆయన సంపద కేవలం 8 శాతం మాత్రమే పెరిగింది. గత ఏడాదితో పోల్చితే ఆయన ఆస్తి రూ. 7 వేల కోట్లు క్షీణించింది. ప్రస్తుతం ఉదయ్ కోటక్ సంపద విలువ రూ.87 వేల కోట్లు. దీంతో ఆయన ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
దక్షిణాదికి చెందిన సన్‌ఫార్మా చైర్మన్ దిలీప్ సంఘ్వీ అపర కుబేరుల జాబితాలో 9 వస్థానాన్ని దక్కించుకున్నారు. సన్ ఫార్మా షేర్ విలువ 22 శాతం పెరగడంతో ఆస్తుల విలువ 84 వేల కోట్లకు చేరుకుంది. కరోనా సంక్షోభం ఈయనకు బాగా కలిసొచ్చింది అని చెప్పవచ్చు. ఈ ఏడాది దిలీప్ 12,500 కోట్లు వెనకేసుకున్నారు. మార్చిలో లాక్‌డౌన్ ప్రారంభమైనప్పుడు సన్‌ఫార్మ షేర్ విలువ 25 శాతం పడిపోయింది. తర్వాత 6 నెలల్లో 60 శాతం పెరిగింది.
రూ.76 వేల కోట్ల సంపదతో మిస్త్రీలు అపర కుబేరుల జాబితాలో పదో స్థానంలో నిలిచారు. 55 ఏళ్ల షాపూర్ పలోంజి మిస్త్రీ, 52 ఏళ్ల సైరస్ పలోంజి మిస్త్రీ సంయుక్తంగా ఈ స్థాయిలో ఆస్తులను కలిగిఉన్నారు. ఏది ఏమైనా కరోనా విపత్తులోనూ వ్యాపారవేత్తలు రాణించారు. సామాన్యులు ఇబ్బందులు పడ్డారే తప్ప కోటిశ్వరులకు ఏ ఇబ్బంది కలుగులేదు. వారు తమ ఆస్తులను మరింత పెంచుకోగలిగారు.