Begin typing your search above and press return to search.
బీహార్ ఎన్నికలపై ది వీక్ మాట ఏమిటంటే..?
By: Tupaki Desk | 15 Oct 2015 5:55 AM GMTపోటాపోటీగా సాగుతూ.. ప్రధాని మోడీ సమర్థతకు.. ఆయన 18 నెలల పాలనకు రెఫరెండం అవుతుందని భావిస్తున్న బీహార్ ఎన్నికల ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటం పార్టీలను ఉత్కంటకు గురి చేస్తోంది. సాధారణంగా సర్వేలన్నీ ఒకే తీరులో ఉండకున్నా.. ఇంచుమించు ఒకేలాంటి ఫలితాన్ని చెబుతుంటాయి. దీనికి భిన్నంగా ప్రస్తుతం బీహార్ లో పరిస్థితి నెలకొంది.
కొన్ని మీడియా సంస్థల సర్వేల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని చెబుతుంటే.. మరికొన్ని మీడియా సంస్థల సర్వేలు మహా కూటమిదే విజయమని తేలుస్తున్నాయి. తాజాగా ద వీక్ మ్యాగ్ జైన్ నిర్వహించిన ఓపీనియన్ పోల్ లో ఫలితాలు మహాకూటమికి అనుకూలంగా ఉండటం గమనార్హం.
మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్ రాష్ట్రంలో మహా కూటమి 122 సీట్లు సాధిస్తుందని.. ఎన్డీయే కూటమి 117 సీట్లకే పరిమితం అవుతందని అంచనా వేస్తోంది. రెండు కూటమిల మధ్య పోటీ తీవ్రంగా ఉందని.. రెండు కూటమిల మధ్య ఓట్ల శాతం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఓట్ల శాతం విషయంలో మహా కూటమి కంటే ఎన్డీయే స్వల్ప అధిక్యంలో ఉన్నా తుది ఫలితం మాత్రం మహా కూటమికి అనుకూలంగా ఉంటుందని చెప్పటం విశేషం. మహా కూటమి 38.2 శాతం ఓట్లను సొంతం చేసుకునే అవకాశం ఉందని తాజా సర్వే చెబుతున్నట్లు వెల్లడించింది. అదే సమయంలో ఎన్డీయే కూటమి 38.7 శాతం ఓట్లను సాధించగలదన్న అంచనా వేసింది. ఎన్డీయేలో బీజేపీ అత్యధికంగా 36.6 శాతం ఓట్లను చేజిక్కించుకుంటే మహా కూటమిలో జేడీయూ వాటా 24.8 శాతం.. ఆర్జేడీ శాతం 10.3 గా ఉంటుందని తేల్చారు. మొత్తం శాంపిల్ లో 46 శాతం మంది నితీశ్ కుమారే అత్యంత సమర్థుడైన ముఖ్యమంత్రిగా తేల్చిన నేపథ్యంలో.. తుది ఫలితం మహా కూటమికి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.
గమనించాల్సిన అంశం ఏమిటంటే.. తొలి దశ ఓటింగ్ ముగిసిన వెంటనే సమాజ్ వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. మహా కూటమి ఓటమి దిశగా పయనిస్తుందన్న వ్యాఖ్యలు చేసిన రెండు రోజులకే.. ద వీక్ సర్వే భిన్నవాదనను వినిపించటం. నేతల మాటలు.. మీడియా సంస్థల అంచాల నడుమ బీహారీలు తుది తీర్పు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.