Begin typing your search above and press return to search.
కరోనా భయం.. కుటుంబాన్ని బలి చేసింది
By: Tupaki Desk | 14 May 2021 2:53 PM GMTకరోనా కంటే కూడా ఇప్పుడు మా చెడ్డది భయం.. ఆ భయమే మనిషి ప్రాణాలు తీస్తుంది. కరోనాకు మనిషి ప్రాణాలు తీసేంత శక్తి లేకున్నా.. దాన్ని మనం అతిగా ఊహించుకొని ఆత్మస్థైర్యం కోల్పోయి అసవులు బాస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
తాజాగా విజయనగరం జిల్లాలో దారుణం వెలుగుచూసింది. కరోనా సోకిందని భయపడి ఓ కుటుంబం మొత్తం మూకుమ్ముడిగా ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందడం విషాదం నింపింది.
విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబెల్లిలో సత్యనారాయణ గుప్తా అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతడి వయసు 62 ఏళ్లు. భార్య సత్యవతికి 57 ఏళ్లు. వీళ్లు కొన్నాళ్లుగా విశాఖ జిల్లా చోడవరంలో ఉంటున్నారు. 4 రోజుల కిందట వీళ్లకు కరోనా సోకింది. పాజిటివ్ అని తెలిసిన వెంటనే స్వగ్రామం వచ్చేశారు. వీళ్లతోపాటు వైరస్ బారిన పడిన కొడుకు, కోడలు కూడా వచ్చారు. అంతా కలిసి ఇక కరోనా మమ్మలను బతకనివ్వదు అని డిసైడ్ అయ్యి ఇంట్లో ఉన్న నేల బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు చిన్నారులను మాత్రం అలాగే వదిలేశారు. వారిప్పుడు అనాథలయ్యారు. దీంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి.
కాగా కరోనా సోకడంతో ఊర్లో ఎవరూ పట్టించుకోకపోవడంతో అవమాన భారంతో కృంగి మనస్థాపంతోనే వీరు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.