Begin typing your search above and press return to search.

మ‌న జేమ్స్ బాండ్ పుత్ర‌ర‌త్నంపై మ‌ర‌క‌ప‌డిందే!

By:  Tupaki Desk   |   5 Nov 2017 5:41 AM GMT
మ‌న జేమ్స్ బాండ్ పుత్ర‌ర‌త్నంపై మ‌ర‌క‌ప‌డిందే!
X
గ‌డిచిన మూడున్న‌రేళ్ల‌లో మోడీ స‌ర్కారుకు తిరుగులేని రీతిలో ఉండ‌టానికి కార‌ణం.. ప్ర‌భుత్వంలో అవినీతి భారీగా త‌గ్గింద‌న్న మాట‌. ప్ర‌ధాని కుర్చీలో కూర్చున్న త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కూ అవినీతి మ‌ర‌క ప‌డ‌లేదు. ఈ విష‌యాన్ని గొప్ప‌గా చెప్పుకునే వారు క‌మ‌ల‌నాథులు. అయితే.. అలాంటి మాట‌ల‌కు చెక్ చెప్పేలా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా పుత్ర‌ర‌త్నం లీలల్ని బ‌య‌ట పెట్టిన వైర్‌.. సంచ‌ల‌నం సృష్టించింది.

వంద కోట్ల న‌ష్ట‌ప‌రిహారం షా వేయ‌టం.. అదో క‌ల‌క‌లంగా మార‌టం తెలిసిందే. అమిత్ షా పుత్ర‌ర‌త్నంపై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు ఒక కొలిక్కి రాక ముందే మ‌రో సంచ‌ల‌న అంశం బ‌య‌ట‌కు వ‌చ్చింది. జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు.. ఇండియ‌న్ జేమ్స్ బాండ్ గా అభివ‌ర్ణించే అజిత్ దోవ‌ల్ కొడుకు శౌర్య‌కు చెందిన ఒక కంపెనీలో న‌లుగురు కేంద్ర మంత్రులు డైరెక్ట‌ర్లుగా ఉన్నార‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

దీనికి సంబంధించి విప‌క్ష కాంగ్రెస్ తాజాగా ఆరోప‌ణ‌లు చేసింది. శౌర్య‌కు చెందిన ఇండియా ఫౌండేష‌న్ సంస్థ‌లో కేంద్ర మంత్రులు నిర్మ‌ల సీతారామ‌న్‌.. సురేశ్ ప్ర‌భు.. జ‌యంత్ సిన్హా.. ఎంజే అక్బ‌ర్ లు స‌భ్యులుగా ఉన్న‌ట్లుగా ఆరోపణ‌లు వెల్లువెత్తున్నాయి. ప‌ర‌స్ప‌ర విరుద్ధ ప్ర‌యోజ‌నాల్ని పొందేందుకే ఇలా చేసి ఉంటార‌ని ది వైర్ త‌న తాజా క‌థ‌నంలో వెల్ల‌డించింది.

సంచ‌ల‌నంగా మారిన ఈ ఉదంతంపై కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ స్పందించారు. అమిత్ - జ‌య్ షాల ఎపిసోడ్ ఘ‌న‌విజ‌యం త‌ర్వాత బీజేపీ ఇప్పుడు అజిత్ దోవ‌ల్ = శౌర్యాల క‌థ‌ను కొత్త‌గా ప్రారంభించిన‌ట్లుగా ట్వీట్ తో ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే త‌మ‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్లో ఏ మాత్రం నిజం లేద‌ని ఇండియా ఫౌండేష‌న్ స్ప‌ష్టం చేసింది. ఆరోప‌ణ‌లు వ‌చ్చిన న‌లుగురు.. మంత్రులు కాక ముందు నుంచే ఇందులో ఉన్న‌ట్లుగా వెల్ల‌డించింది.

మంత్రులు అయ్యాక సంస్థ‌లోకి వ‌చ్చారా? మ‌ంత్రులు కాక ముందే ఉన్నారా? అన్న విష‌యాల్ని కాసేపు ప‌క్క‌న పెట్టి వాస్త‌వాల్ని ప‌క్క‌న పెడితే.. వైర్ చేసిన ఆరోప‌ణ‌లు నిజ‌మ‌న్న విష‌యం తేలిన‌ట్లేన‌ని చెబుతున్నారు. మంత్రులు కాక ముందు నుంచే సంస్థ‌లో ఉన్న‌ప్ప‌టికీ.. మంత్రులుగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌టానికి ముందో.. త‌ర్వాతో ఈ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. చూస్తుంటే.. మోడీ బ్యాచ్ ను ఎవ‌రు వ‌దిలినా వ‌ద‌ల‌కున్నా.. ది వైర్ మాత్రం ఇప్ప‌ట్లో వ‌దిలేట్టుగా లేద‌న్న భావ‌న క‌లుగుతోంది.