Begin typing your search above and press return to search.
మంత్రి మల్లారెడ్డిపై కబ్జా కేసు
By: Tupaki Desk | 8 Dec 2020 5:27 PM GMTతెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఓ మహిళ భూ కబ్జా కేసు నమోదు చేయడం సంచలనం రేపింది. తన భూమిలో మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కుత్బుల్లాపూర్ మండలం సూరారానికి చెందిన శ్యామలా దేవి అనే మహిళ కేసు పెట్టారు. ఈ భూ వ్యవహారంలో తనకు న్యాయం చేయాలంటూ ఓ లాయర్ ను సంప్రదించగా ఆయన కూడా మంత్రితో కుమ్మక్కయ్యారని ఆమె ఆరోపించారు. తప్పుడు పత్రాలు సృష్టించి తన భూమిని కబ్జా చేశారని ఆమె ఫిర్యాదు చేశారు. మంత్రి అనుచరులు తన స్థలంలో ప్రహరీగోడ నిర్మించారని, తప్పుడు అగ్రిమెంట్‌ను సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శ్యామలా దేవి ఫిర్యాదు ప్రకారం మంత్రి మల్లారెడ్డిపై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో గులాబీ బాస్ కేసీఆర్ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంత్రి వర్గ ప్రక్షాళన ఉండబోతోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా కొందరు మంత్రులకు కొన్ని డివిజన్ల చొప్పున కేటాయించిన కేసీఆర్....ఫలితాలను బట్టి ఆయా మంత్రులకు మార్కులు వేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే బల్దియా ఫలితాలపై అసంతృప్తితో ఉన్న కేసీఆర్...మంత్రులు, ఎమ్మెల్యేలపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డిపై వ్యవహారం బీజేపీకి అస్త్రంలా మారే అవకాశముంది. దీంతో, మల్లారెడ్డి వ్యవహారంలో కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.