Begin typing your search above and press return to search.

విధుల్లో చేరిన ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేసిన కార్మికులు

By:  Tupaki Desk   |   6 Nov 2019 1:16 PM GMT
విధుల్లో చేరిన ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేసిన కార్మికులు
X
గత 33 రోజులుగా తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. తమ సమస్యలని పరిష్కరించిన తరువాతే విధుల్లోకి అని కార్మికులు తేల్చిచెప్పడంతో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 2 వ తేదీన ఆర్టీసీ సమ్మె పై మాట్లాడిన సీఎం ..ఇప్పటికే తెలంగాణ లోని సగం రూట్లని ప్రైవేట్ పరం చేయాలనీ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అలాగే ఆర్టీసీ కార్మికులు సమ్మెని వదిలి 5 వ తేదీ అర్ధరాత్రి లోపు విధుల్లోకి చేరితే ఆర్టీసీ ఉంటుంది అని ..ఆలా కానీ పక్షంలో మిగిలిన రూట్లని కూడా ప్రైవేట్ రంగానికే అప్పగిస్తామని తేల్చి చెప్పారు. అలాగే విధుల్లో చేరే కార్మికులకు ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుంది అని చెప్పారు.

సీఎం కేసీఆర్ మాటలు విన్న కొంతమంది కార్మికులు సమ్మె నుండి బయటకి వచ్చి విధుల్లో చేరారు. కానీ , చాలా తక్కువ మంది మాత్రమే సీఎం మాటలని పట్టించుకున్నట్టు అర్థమౌతుంది. ఇకపోతే సీఎం కేసీఆర్ పిలుపుతో విధుల్లో చేరిన ముగ్గురు సిబ్బందిపై ఆర్టీసీ కార్మికులు దాడికి పాల్పడ్డారు. కండక్టర్‌ కోమల, డ్రైవర్లు తాజుద్దీన్‌, వాజిద్‌లపై దాడి చేసి కొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ డిపో దగ్గర జరిగింది.

ఆందోళనలో భాగంగా మహబూబ్ నగర్ లో ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. ఇందులో భాగంగానే ఆర్టీసీ బస్సులను అడ్డగించిన కార్మికులు… విధుల్లో చేరిన వారిపై దాడికి దిగారు. బస్సులోంచి కండక్టర్, డ్రైవర్ ను బయటకు లాగి కొట్టారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. సిబ్బందిపై దాడి ర్వాత కార్మికులు డిపోలోకి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. సమ్మె ప్రారంభమై 33 రోజులు కావొస్తున్నా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం తో సమ్మె చేస్తున్న కార్మికులు అక్కడక్కడా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే సీఎం ఇచ్చిన గడువు ముగియడంతో .. సీఎం కేసీఆర్ రవాణా శాఖ మంత్రితో , అలాగే సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు.