Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే తొలి శృంగార పార్క్

By:  Tupaki Desk   |   27 Jun 2018 1:30 AM GMT
ప్రపంచంలోనే తొలి శృంగార పార్క్
X
ప్రపంచంలోనే తొలి శృంగార పార్క్ ఆవిర్భవించింది. శృంగారభంగిమలతో మతులు పోగొడుతోంది. నిర్మాణ దశలో ఎన్నో పార్క్ నిర్మాణానికి వివాదాలు ఎదురైనప్పటికీ ఎట్టకేలకు పూర్తి అయ్యింది. ప్రస్తుతం ప్రజల సందర్శనార్థం సిద్ధమైంది.

బ్రెజిల్ లోని సావో పాలో ప్రాంతంలో ఏర్పాటైన ఈ శృంగార పార్క్ లో వినోదానికి 18 ఏళ్లు నిండిన వారినే అనుమతిస్తారు. ‘ఎలోటికా ల్యాండ్’ గా పిలుస్తున్న సెక్స్ థీమ్ పార్క్ లో శృంగార శిల్పాలు - సెక్స్ షాప్ - న్యూడ్ ఫూల్ - రెచ్చగొట్టే ఆటలు - వైబ్రేటింగ్ సీట్లతో కూడా సినిమా హాలు - హోటల్ ఉన్నాయి. దాదాపు 22.4 మిలియన్ డాలర్ల ఖర్చుతో ప్రపంచంలోనే ఈ తొలిసెక్స్ పార్క్ ను నిర్మించారు.

ఈ పార్క్ లో అందమైన ప్రకృతి సోయగాలు - సాహస క్రీడలు - వాటర్ రైడ్స్ వంటి వాటిని అనేకం ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఎన్నో థీమ్ పార్కులు ఉన్నా.. ఇలా శృంగార పార్క్ ను నిర్మించడం ఇదే తొలిసారి అంటున్నారు నిర్వాహకులు. అయితే ఇక్కడ శృంగారం చేయడానికి మాత్రం వీల్లేదని ముందే స్పష్టం చేస్తున్నారు.