Begin typing your search above and press return to search.

‘యోని’ మ్యూజియం.. ప్రత్యేకతలివే.?

By:  Tupaki Desk   |   21 Sep 2019 1:25 PM GMT
‘యోని’ మ్యూజియం.. ప్రత్యేకతలివే.?
X
మ్యూజియం అంటే ఏమిటీ.. ఏదైనా ఒక రంగానికి లేదా చరిత్రకు సంబంధించిన అవశేషాలు - కళాకృతులను భద్రపరిచే ప్రదేశం.  సాధారణంగా దేశంలో చరిత్రకు సంబంధించిన రాజులు - రాజ్యాల వాటి అవశేషాల మ్యూజియాలను చూశాం.. ఇక హీరోల మైనపు బొమ్మలను ఏర్పాటు చేసే మేడమ్ టుస్సాడ్ మ్యూజియంల గురించి మనకు తెలుసు. ఇక స్పేస్ సంగతుల గురించి ఇస్రో - నాసా ఏర్పాటు చేసిన ‘స్పేస్ మ్యూజియాలు’ తెలుసు. కానీ ఇదీ కనీవినీ ఎరుగని మ్యూజియం.. అదే ‘యోని మ్యూజియం’. వాక్.. అదేంటని చీదరించుకోకండి.. ఇది  స్త్రీల జననాంగం గురించి అందరికీ తెలియజేయడానికి సదాశయంతో ఏర్పాటు చేసిన మ్యూజియం.. అదెక్కడుంది.? దాని విశేషాలేంటో తెలుసుకుందామా.?
 
యోని మ్యూజియం అనగానే అందరూ ఇదేంట్రా బాబూ అని కంగారు పడకండి.. మన  శరీరంలోని ఒక సున్నితమైన అంగం గురించిన అవగాహన కోసం ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. యోని గురించి అవగాహన లేక.. దాని గురించి బయటకు చెప్పలేక ఎలాంటి వ్యాధులు సోకుతున్నాయో తెలియజెప్పేందుకు దీన్ని తీర్చిదిద్దారు. 

2017లో ఐస్ ల్యాండ్ దేశంలో పురుషాంగంపై అవగాహన కోసం ఓ మ్యూజియ్యాన్ని ప్రారంభించారు. దానిపై అందరిలో ఉన్న అపోహలను తొలగించారు. దాని గురించి పూర్తి సమాచారాన్ని ఆ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. పురుషులదే కాదు జంతువుల పురుషాంగాలను అందులో పొందుపరిచి అవగాహన కల్పించారు.

ఇప్పుడు అదే స్ఫూర్తితో లండన్ లోని కామ్డెన్ మార్కెట్లో ప్రపంచంలోనే తొలిసారిగా ‘వజైనా మ్యూజియం’ అదే స్త్రీల మర్మాంగమైన ‘యోని మ్యూజియం’ను ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రజలే 50వేల పౌండ్లు (44,37,309) విరాళాలుగా ఇవ్వడం విశేషం. ఈ మ్యూజియాన్ని ఫ్లోరెన్స్ షెక్టర్ అనే వ్యక్తి ఏర్పాటు చేశారు. స్త్రీల మర్మాంగాలపై ప్రజల్లో ఉండే అపోహలను తొలగించడమే ఈ మ్యూజియం ప్రధాన ఉద్దేశంగా నెలకొల్పారు.

ఈ యోని మ్యూజియంలోకి వచ్చే సందర్శకులకు దాని గురించి పూర్తి అవగాహన కల్పిస్తారు. యోనిపై పుస్తకాలు - ఆర్ట్ లు - పనిచేసే తీరు - దాని వల్ల వచ్చే వ్యాధుల గురించి వివరిస్తారు. మహిళల జననాంగాలను హింసించడం.. గృహ హింసలు - అత్యాచారాల వల్ల కలిగే హింసపై ఇక్కడ చర్చిస్తారు.  ఇక ఈ మ్యూజియంలో వివిధ పార్టీలు - సెలబ్రెషన్స్ - స్యూలు కార్యక్రమాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.

విశేషం ఏంటంటే ఇక్కడ దొరికే తినుబండరాలన్నీ ‘యోని’ ఆకారంలోనే ఉంటాయి. వాటినే తినాలి.. ఇక కాఫీ పేరు కూడా ‘వెగచ్చినో’ అని దానిపేరే పెట్టారు.  మ్యూజియాన్ని అందరిలోనూ యోనిపై ఉండే అపోహలను తొలగించడానికే ఏర్పాటు చేసినట్టు నిర్వాహకుడు ఫ్లోరెన్స్  తెలిపారు.