Begin typing your search above and press return to search.

భారత్ లో బయటపడిన వేరియంట్లకు రెండు పేర్లు పెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

By:  Tupaki Desk   |   1 Jun 2021 12:00 PM IST
భారత్ లో బయటపడిన వేరియంట్లకు రెండు పేర్లు పెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
X
ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ 19 అంతకంతకూ విస్తరిస్తూ.. తనను తాను రూపాంతరం చెందటం తెలిసిందే. అంతకంతకూ వ్యాప్తి చెందుతూ.. మ్యుటెంట్ అయ్యే లక్షణం ఉన్న ఈ మహమ్మారి.. భారత్ లో బి.1.617.1, బి.1.617.2 వేరియంట్లు దేశానికి పరీక్షగా మారింది. ఈ రెండు వేరియంట్లను సులువుగా చెప్పేందుకు వీలుగా కొందరు భారత్ వేరియంట్లు అంటూ ప్రచారం చేయటం మొదలు పెట్టారు. దీనిపై కేంద్రప్రభుత్వం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమేకాదు.. భారత్ వేరియంట్లు అంటూ ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటానని స్పష్టం చేసింది.

ఇలాంటివేళ.. ఈ రెండు వేరియంట్లకు రెండు సులువైన పేర్లను పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. గ్రీస్ అక్షరమాల ప్రకారం కరోనా వైరస్ వేరియంట్లకు పేర్లను పెడుతున్న క్రమంలో.. భారత్ లో గుర్తించిన రెండు వేరియంట్లకు కప్పా.. డెల్టా అన్న పేర్లను పెట్టినట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ విభాగానికి చెందిన మరియా వెల్లడించారు.

కరోనా వైరస్ కొత్త వేరియంట్లను తొలుత సాంకేతిక నామాలతో వ్యవహరించేవారు. ఇది కష్టంగా ఉండటంతో సులువుగా గుర్తించేందుకు దేశాల పేర్లు పెట్టటం మొదలు పెట్టారు. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందిస్తూ.. కొవిడ్ వేరియంట్లకు దేశాల పేర్లతో పిలవకుండా.. వాటి కంటూ ప్రత్యేక గుర్తింపు ఇచ్చేలా పేర్లను డిసైడ్ చేస్తోంది. ఇందులో భాగంగానే కప్పా.. డెల్టా పేర్లను డిసైడ్ చేశారు.