Begin typing your search above and press return to search.

మున్ముందు మరిన్ని మహమ్మారుల దాడులు.. డబ్ల్యూహెచ్​వో హెచ్చరిక

By:  Tupaki Desk   |   8 Sep 2020 5:34 PM GMT
మున్ముందు మరిన్ని మహమ్మారుల దాడులు.. డబ్ల్యూహెచ్​వో హెచ్చరిక
X
కరోనా వైరస్​తో ప్రపంచం ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. కరోనా మహమ్మారి ఇప్పటికే ప్రపంచదేశాలను వణికిస్తుండగా.. భవిష్యత్​లో మరిన్ని రోగాలు ప్రజలను పీడించబోతున్నాయని చెప్పింది. ఆ రోగాలు కరోనా లాంటి మహమ్మారులు కావచ్చు.. అంతకంటే భయంకరమైనవి కావొచ్చు. కాబట్టి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈమేరకు మంగళవారం డబ్ల్యూహెచ్​వో చీఫ్​ టెడ్రోస్​ అధనామ్​ గేబ్రేయేసస్​ హెచ్చరికలు జారీచేశారు. ప్రపంచదేశాలన్నీ ప్రజల ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలని.. కొత్తగా డాక్టర్లను, వైద్యసిబ్బందిని నియమించుకోవాలని ఆయన సూచించారు. తమ దగ్గర ఉన్న వైద్యవ్యవస్థను మరింత పటిష్ఠ పరుచుకోవాలని పేర్కొన్నారు.

వైద్యాన్ని వ్యాపారంగా మార్చకుండా ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు కృషిచేయాలని సూచించారు. ఏ ఒక్కదేశమో వ్యాక్సిన్​ పంపిణీని చేపట్టినంత మాత్రనా మహమ్మారి పోయిందని భావించలేమని పేర్కొన్నారు. ప్రపంచదేశాలన్నీ అనుసంధానమై వ్యాక్సిన్​ పంపిణీకి సహకరించుకోవాలని సూచించారు. ప్రతి చిన్న దేశానికి వ్యాక్సిన్​ పంపిణీ చేయడం కీలకమని చెప్పారు. మరోవైపు ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాక్సిన్​ను పంపిణీ చేసేందుకు ‘కోవ్యాక్స్​’ అనే కార్యక్రమానికి డబ్ల్యూహెచ్​వో శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా బీద దేశాలకు వ్యాక్సిన్​ పంపిణీ చేసేందుకు డబ్ల్యూహెచ్​వో కృషి చేస్తోంది. ఇందుకోసం మనదేశం కూడా తనవంతు సాయం అందిస్తోంది. కాగా టెడ్రోస్​ వ్యాఖ్యలు ప్రస్తుతం వైద్య వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాయి.