Begin typing your search above and press return to search.
షాకింగ్ వీడియో.. కారులో కూర్చుని బర్గర్ తినడమే ఆ యువకుడు చేసిన నేరం!
By: Tupaki Desk | 10 Oct 2022 6:33 AM GMTఅమెరికాలో గన్ కల్చర్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను ఆ సంస్కృతి గాల్లో కలిపేసింది. దీనిపై దేశవ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇటీవల ఒక ఉన్మాది స్కూల్లో 21 మంది పిల్లలను కాల్చిచంపాక.. గన్ కల్చర్‌కు చరమగీతం పాడతామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయినా ఇంకా అమెరికాలో పోలీసులు సైతం తామేమీ తక్కువ తినలేదని నిరూపిస్తూనే ఉన్నారు. కారులో కూర్చుని బర్గర్ తింటున్నాడని ఓ యువకుడిని ఓ పోలీసు అధికారి అతడిపై పలు రౌండ్లు కాల్పులు జరపడం కలకలం రేపుతోంది.
ఆ యువకుడేమీ తప్పు చేయలేదు. శాన్ ఆంటోనియా ప్రాంతంలోని పార్కింగ్ ఏరియాలోనే తన కారును పార్కు చేసుకుని.. అందులో కూర్చుని బర్గర్ తింటున్నాడు. ఈ ఘటన పూర్తి వివరాల్లోకెళ్తే.. అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం ఎరిక్ చాంటు (17) అనే యువకుడు మెక్‌డొనాల్డ్స్ పార్కింగ్ ప్రాంతంలో కారులో కూర్చుని బర్గర్ తింటున్నాడు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన సాన్ ఆంటోనియా పోలీసు అధికారి జేమ్స్ బ్రెన్నాండ్.. కారు డోరు తీశాడు. పార్కింగ్ ప్రాంతంలో ఎందుకు తింటున్నావని యువకుడిని ప్రశ్నించాడు. వాహనం నుంచి కిందకు దిగాలని ఆ యువకుడిని కోరాడు. అయితే ఎందుకు దిగాలని చింటూ ఎదురు ప్రశ్నించాడు. ఈ క్రమంలో అతడిని బయటకు లాగేందుకు పోలీసు అధికారి జేమ్స్ బ్రెన్నాండ్ ప్రయత్నించాడు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని కారు డోరు తెరిచి ఉండగానే కారును ఎరిక్ చింటూ రివర్స్ చేశాడు.
ఈ క్రమంలో యువకుడిపై పోలీసు అధికారి జేమ్స్ పలు రౌండ్ల కాల్పులు జరిపాడు. కారు వేగం పెంచిన యువకుడు డోర్ మూసేసి అలాగే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా పోలీసు అధికారి కాల్పుల్లో ఆ యువకుడు గాయపడ్డాడు. కారు వెనుక సీట్లో 17 ఏళ్ల ఓ బాలిక కూడా ఉంది. అయితే, ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ముందు పోలీసు అధికారితో యువకుడు గొడవ పడ్డాడని.. ఈ క్రమంలో పోలీసు అధికారి జేమ్స్‌పై దాడి చేసినట్లు మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పోలీసు అధికారి బాడీ క్యామ్ వీడియో బయటకు రావటంతో అసలు విషయం వెలుగుచూసింది.
కాగా పోలీసు కాల్పుల్లో గాయపడిన బాధితుడు ఎరిక్ చింటూ ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రాణ రక్షణ కోసం మాత్రమే తుపాకీ వాడాలనేది అక్కడి నిబంధన కాగా.. అలాంటి పరిస్థితి ఏమీ కనిపించడంలేదని స్వయంగా పోలీసు ఉన్నతాధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జేమ్స్ పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
కాగా ఎరిక్ చింటూపై పోలీసు అధికారి జేమ్స్ ఇష్టారీతిన కాల్పులు జరుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.