Begin typing your search above and press return to search.
వీడియో వైరల్.. మ్యాచ్ మధ్యలో గర్ల్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసిన యువకుడు!
By: Tupaki Desk | 27 Oct 2022 2:30 PM GMTఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియా – నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనేక ఆసక్తికర పరిణామాలకు దారితీసింది. సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట భారత్ బ్యాటింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే. 20 ఓవర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మెన్లు విరాట్ కోహ్ల, సూర్యకుమార్ యాదవ్‌లు చెలరేగడంతో భారత్ భారీ స్కోర్ చేసింది.
కాగా ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే సిడ్నీ గ్రౌండ్స్‌లో ఒక ప్రేమ జంట ఒక్కటైంది. ఒక భారత యువకుడు ఒక యువతికి లవ్ ప్రపోజ్ చేశాడు. అంతేకాకుండా తన ప్రేమకు గుర్తుగా ఒక ఉంగరాన్ని కూడా ఆమె చేతికి తొడిగాడు. దీంతో ఆ యువతి అతడికి తన అంగీకారాన్ని తెలుపుతూ నవ్వులతో సిగ్గుల మొగ్గ అయ్యింది.
దీంతో అక్కడ ఉన్న కెమెరాలన్నీ ఈ ప్రేమ జంటను ఫొటోలు, వీడియోల రూపంలో బంధించాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు ఈ వీడియోను లైకులు, షేర్లతో హోరెత్తించారు. అంతేకాకుండా ఈ ప్రేమ జంటకు తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ వీడియోను పోస్టు చేసిన రెండు గంటల్లోనే ఏకంగా 4,72 లక్షల మందికి పైగా లైక్ చేయడం విశేషం.
కాగా ఈ మ్యాచ్‌లో భారత్ మొదటి బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఇక చేధనను ఆరంభించిన నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులే చేయగలిగింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.