Begin typing your search above and press return to search.

కుక్క కరిస్తే లైట్ తీసుకున్న యువకుడు.. చివరికి ఏమైంది?

By:  Tupaki Desk   |   4 Nov 2022 3:30 PM GMT
కుక్క కరిస్తే లైట్ తీసుకున్న యువకుడు.. చివరికి ఏమైంది?
X
మనిషికి విశ్వాసమైన జీవుల్లో తొలి స్థానం జాగిలానికి (కుక్క) దక్కుతుంది. మానవ నాగరికత మొదలైనప్పటి నుంచి కుక్క మనిషికి నమ్మకమైన జీవిగా ఉంటూ వస్తోంది. విశ్వాసానికి మారుపేరుగా నిలుస్తోంది. ఈ కారణంతోనే చాలా మంది కుక్కలను తమ ఇళ్ళల్లో పెంపుడు జంతువుగా పెంచుకునేందుకు ఇష్టపడుతుంటారు.

పెంపుడు జంతువులకు టీకాలు వేయించినట్లుగా ఉరకుక్కలకు టీకాలు వేసే పరిస్థితి ఉండదు. దీంతో గ్రామ సింహాల విషయంలో మనిషి అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. లేనట్లయితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు కుక్క కాటుకు గురయ్యాడు. అతడు దానిని లైట్ తీసుకోవడంతో చివరికీ అతడి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రంలోని కటక్‌లోని ఉదయ్ పూర్ గ్రామంలో రాజేష్ బ్యూరా అనే యువకుడు నివసిస్తున్నాడు. గత ఆరునెలల క్రితం ఆ యువకుడిని ఒక కుక్క కరిచింది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకు తెలియడంతో అతడిని ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలని సూచించారు. అయితే వారి మాటలను రాజేష్ పెద్దగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాడు.

ఈ నేపథ్యంలోనే అతడిలో క్రమంగా మార్పులు వచ్చాయి. ఆరు నెలల తర్వాత అతడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. నవంబర్ ఒకటి నుంచి అతను కుక్కలా అరవడం మొదలు పెట్టాడు. దీంతో చుట్టుపక్కల వాళ్లకు కుటుంబ సభ్యులకు రాజేష్ పరిస్థితి వింతగా అనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కళాశాలకు తరలించారు.

రాజేష్ లో వచ్చిన మార్పులపై కటక్ వైద్యులు స్పందించారు. అతడిలో రాబిస్ సోకిన లక్షణాలు ఉన్నాయని తెలిపారు. కుక్క కరిచిన వెంటనే వైద్యం చేయించుకోకపోతే సదరు వ్యక్తికి హైడ్రోఫోబియా లేదా నీటి భయం ఏర్పడుతుందని వైద్యులు తెలిపారు. కుక్క కాటుకు గురైన వ్యక్తులు నీటి శబ్దాన్ని కూడా సహించలేరని.. గొంతు నిప్పితో కుక్కలా అరవడం చేస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కుక్క కాటే కాదా? అని లైట్ తీసుకున్న చివరకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాజేష్ కు జరిగిన సంఘటన ద్వారా తెలుస్తోంది. ఇప్పటికైనా డాగ్ లవర్స్ ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.