Begin typing your search above and press return to search.
మంత్రితో రాసలీలలు చేసిన యువతి మరో కలకలం
By: Tupaki Desk | 14 March 2021 6:07 AM GMTకర్ణాటకలో ఓ సిట్టింగ్ మంత్రి రాసలీలల సీడీ బయటపడి తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బకు ఆ మంత్రి రాజీనామా కూడా చేసేశాడు. దీనిపై సిట్ ఏర్పాటు చేసిన కర్ణాటక ప్రభుత్వం సూత్రధారులపై విచారణ జరుపుతోంది. బాధిత యువతితోపాటు ఐదుగురు జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులను విచారిస్తున్నారు.
కర్ణాటకలో రాసలీలల కేసులో ప్రధాన సూత్రధారి అయిన యువతి వాయస్ మరోసారి కలకలం రేపింది. సోషల్ మీడియాలో వేదికగా సదురు యువతి తన ఆవేదనను వినిపించింది. ఆ యువతి తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రమేశ్ జార్కిహొళితో రాసలీలల్లో మునిగి తేలుతూ వీడియోలో కనిపించిన యువతి, గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్కడుందో ఆమె కానీ.. ఓ వీడియో సందేశాన్ని తాజాగా విడుదల చేసింది. మరోసారి రమేశ్ జార్కి హొళిపై విమర్శలు గుప్పించింది.రమేశ్ జార్కిహొళి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి తనను లోబరుచుకున్నాడని వాపోయింది. అయితే మాట ఇచ్చి తప్పాడని, పైగా ఆయనే సీడీని బయటకు విడుదల చేశారని ఆరోపించడంతో మరోసారి కర్నాటకలో కాక రేపుతోంది.
అయితే ఆ వీడియోను ఎవరు, ఎలా చిత్రీకరించారో తనకు తెలియదని చెప్పుకొచ్చింది.రాసలీలలో మునిగి ఉన్న ఆ వీడియో బయటికి రావడంతో తన ఆత్మగౌరవానికి భంగం కలిగిందని వాపోయింది. తీవ్ర మనస్తాపానికి లోనైన తాను జీవితంపై విరక్తితో మూడు, నాలుగుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించారని చెప్పుకొచ్చింది. తన వెనుక ఎవరూ లేరని, తనకు ఎలాంటి రాజకీయ మద్దతు కూడా లేదని పేర్కొంది.
తనకు రక్షణ కల్పించాలని రాష్ట్ర హోం మంత్రి బసవరాజు బొమ్మైని ఆ యువతి కోరింది. ప్రస్తుతం యువతి ఆడియో, వీడియోలు కర్ణాటకలో వైరల్ అయ్యాయి. ఈ వీడియో బయటకు రావడంలో కుట్ర ఎవరిది అన్నది చర్చనీయాంశంగా మారింది.