Begin typing your search above and press return to search.
'పామర్రు' వైసీపీలో కలకలం.. రీజనేంటి..!
By: Tupaki Desk | 15 Jan 2023 8:30 AM GMTఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గాల్లో వైసీపీ తంటాలు పడుతోంది. ముఖ్యంగా పామర్రు నియోజకవర్గంలో అయితే.. ఈ ఇబ్బంది మరీ ఎక్కువగా ఉందని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో కైలే అనిల్ కుమార్ గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు.
అయితే.. అధికారులకు, ఆయనకు మధ్య రిలేషన్ లేకుండా పోయింది. దీంతో పనులు జరగడం లేదనే టాక్ వినిపిస్తోంది. పైగా టీడీపీ దూకుడు పెరిగడం.. దీనిని అడ్డుకోలేక పోతున్నారనే వాదన కూడా అనిల్‌కు ప్రాణసంకటంగా మారింది.
గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె యాక్టివ్‌గా లేకపోవడంతో చంద్రబాబు యువనేతను రంగంలోకి దింపారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కుమారుడు కుమార్ రాజా వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీకి రెడీ అయ్యారు. దీంతో నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు. పైగా.. చంద్రబాబు వ్యూహాలను తూచ తప్పకుండా అమలు చేస్తున్నారు. ఫలితంగా.. వైసీపీ వెనుకబడిందనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
ఇంకోవైపు.. వైసీపీ చేపట్టిన కార్యక్రమాలకు కూడా ప్రజల నుంచి రెస్పాన్స్ లేకుండా పోయింది. నిన్న మొన్నటి వరకు అసలు ఇంటి నుంచి బయటకు కూడా రాని అనిల్.. ఇప్పుడు గడపగడపకు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే.. మూడున్నరేళ్ల తర్వాత.. మేం గుర్తుకు వచ్చామా? అంటూ.. ప్రజలు ఆయనను నిలదీస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించేది ఎప్పుడు ? అని ప్రశ్నిస్తున్నారు.
ఈ పరిణామాలపైదృష్టి పెట్టిన పార్టీ అధిస్టానం.. ఇక్కడ అభ్యర్థిని మార్చేందుకు ప్రయత్నిస్తోందనే టాక్ వినిపిస్తోంది. అయితే.. అనిల్‌కు మాజీ మంత్రి కొడాలి నాని అండ ఉందని తెలుస్తోంది. దీంతో తన సీటుకు బెంగ లేదని అనుకుంటున్నా.. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తగ్గించే ప్రయత్నంలో మాత్రం ఎలా చేయాలనేది ఎమ్మెల్యేకు ఇబ్బందిగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.