Begin typing your search above and press return to search.
నీటిపై గాల్లో తేలియాడే థియేటర్.. ఎక్కడో కాదు ఇక్కడే!
By: Tupaki Desk | 5 Nov 2021 7:30 AM GMTఓటీటీలు భారీగా వస్తున్న ఈ సమయంలో థియేటర్లను పరిరక్షించుకునేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల కోసం సరికొత్త అనుభూతిని కలిగించడం కోసం కొత్త కొత్త ప్రయోగాలను చేస్తున్నారు. జనాలు థియేటర్లకు రావడం కోసం జరుగుతున్న ప్రయత్నాలు.. ప్రయోగాలు ఫలితాన్ని ఇస్తున్నాయి. ఇదే సమయంలో జమ్మూ అండ్ కాశ్మీర్ ను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు గాను కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా దాల్ సరస్సు పై గాల్లో తేలియాడే థియేటర్ ను ప్రారంభించారు. ఓపెన్ ఎయిర్ ఫ్లోటింగ్ అనబడే ఈ థియేటర్ ను ప్రయోగాత్మకంగా కాశ్మీర్ లో మొదలు పెట్టి అందరి దృష్టిని ప్రభుత్వం ఆకర్షించింది. సరస్సులో విహరిస్తున్నట్లుగా ఫీల్ అయ్యేలా ఏర్పాట్లు చేయడంతో పాటు సినిమాను కూడా చూసేలా ఈ డిజైన్ ను తయారు చేయడం జరిగింది.
మంచి పర్యటక ప్రాంతం అయిన దాల్ సరస్సును సందర్శించేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున జనాలు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఓపెన్ థియేటర్ ను ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకుల సంఖ్య మరింతగా పెరుగుతుందనే నమ్మకంను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్ రాష్ట్ర పర్యాటక శాఖ మరియు కేంద్ర పర్యటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ఈ థియేటర్ మెయింటెన్స్ ఖచ్చు చాలా తక్కువ అని.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ థియేటర్ ను ఏర్పాటు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఐకానిక్ వేడుకల్లో భాగంగా కశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ మెహతా ఈ ఓపెన్ థియేటర్ ను ప్రారంభించడం జరిగింది.
థియేటర్ లో మొదటగా 1964 లో వచ్చిన కశ్మీర్ కి కలి అనే సినిమాను ప్రదర్శించారు. షమ్మీ కపూర్.. షర్మిలా ఠాగూర్ వంటి ప్రముఖ స్టార్స్ నటించిన ఆ సినిమా అప్పట్లో మెజార్టీ శాతం కశ్మీర్ చుట్టు పక్కల ప్రాంతాల్లోనే తెరకెక్కించడం జరిగింది. కశ్మీర్ యొక్క గొప్ప తనం గురించి ఆ సినిమాలో ప్రముఖంగా చూపించారు. పెద్ద ఎత్తున ఈ సినిమాను ఓపెన్ థియేటర్ లో చూసేందుకు జనాలు వచ్చారు. ముందు ముందు దీన్ని బాగా ప్రచారం చేసి కొత్త సినిమాలను కూడా స్క్రీనింగ్ చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా నిర్వాహకులు పేర్కొన్నారు.