Begin typing your search above and press return to search.

ఈ విషయంలో అరవోళ్ళే నయం

By:  Tupaki Desk   |   18 April 2019 10:16 AM GMT
ఈ విషయంలో అరవోళ్ళే నయం
X
మొన్న జరిగిన తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో చాలా చోట్ల తక్కువ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం చూసి అందరు ఆశ్చర్యపోయారు. పౌరుల్లో సామాజిక బాధ్యత కొరవడిందని దేశం పట్ల తమ వంతుగా నెరవేర్చాల్సిన ఓటు హక్కును వినియోగించుకోలేదని చాలా విమర్శలే వచ్చాయి. హైదరాబాద్ సహా కొన్ని ముఖ్యమైన కేంద్రాల్లో ఇదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాలోన్నీ ఆదోని అనే నియోజకవర్గంలో ఓ బూత్ లో మరీ దారుణంగా 19 శాతం మాత్రమే ఓట్లు వేయడాన్ని ఏమనుకోవాలి. అదే రోజు సినిమాల వసూళ్లు బాగుండటాన్ని మర్చిపోకూడదు.

ఓట్లు వేయని బ్యాచులు థియేటర్లకు వెళ్లారన్న వాస్తవాన్ని విస్మరించలేం. ఈ విషయంలో మాత్రం పక్క రాష్ట్రం తమిళనాడు కొంత నయంగా కనిపిస్తోంది. కారణం లేకపోలేదు. ఇవాళ అక్కడ 18 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. రజనీకాంత్ మొదలుకుని సామాన్య పౌరుల దాకా అందరు ఓటేసి వచ్చారు. దీన్ని ఇంకా పెంచాలనే ఉద్దేశంతో తమిళనాడు సినిమా థియేటర్స్ అసోసియేషన్ మూకుమ్మడిగా ఉదయం మధ్యాన్నం ఆటలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోలింగ్ ముగుస్తుంది కాబట్టి ఆ తర్వాతే షోలు వేయాలని డిసైడ్ అయ్యారు. ఇది ఒకరకంగా మంచి ఆలోచన అని చెప్పాలి. ఈ ఒక్కరోజైనా సినిమాలను ఆపేస్తే వచ్చిన నష్టం తక్కువ. అదే ఓటుని మర్చిపోయే నిర్లక్ష్యానికి ఐదేళ్లు మూల్యం చెల్లించాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరిగిన ఏప్రిల్ 11న థియేటర్లు మూసివేయడం కాదు కదా కనీసం ఆ ఆలోచన కూడా ఇక్కడెవరికి రాలేదు.